Friday, February 21

CURRENT AFFAIRS MAY 12 & 13

తెలంగాణ
01) రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఫిర్యాదులు వస్తే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత ?
జ: 1800 425 00333
02) తెలంగాణ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు డ్రైపోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి డ్రైపోర్టును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: నల్గగొండ జిల్లా చిట్యాల
03) రాష్ట్రంలో డయేరియా నివారణకు ఏ టీకాను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రోటా వైరస్ టీకాను
04) సలేశ్వరం జాతర ప్రతియేటా తెలంగాణలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు ?
జ: నాగర్ కర్నూలు జిల్లా

జాతీయం
05) భారత వైమానిక దళంలో 22 అపాచీ గార్డియన్ (AH64 E(I) హెలికాప్టర్లు చేరాయి. ఈ హెలిక్టాపర్ల కోసం 2015 సెప్టెంబర్ లో భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ?
జ: అమెరికాతో
(నోట్: పాత MI-35 హెలికాప్టర్ల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు )
06) ఐటీసీని బహుముఖ కంపెనీగా పటిష్టం చేసి 23 యేళ్ళ పాటు ఛైర్మన్ గా పనిచేసి మే 11న చనిపోయిన పారిశ్రామిక దిగ్గజం ఎవరు ?
జ: యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్)
07) హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ లో ఏ జట్టు ఫైనల్ లో విజేతగా నిలిచింది ?
జ: ముంబై ఇండియన్స్
08) ముంబై ఇండియన్స్ ఇప్పటి దాకా ఎన్ని సార్లు IPL ట్రోఫీ విజేతగా నిలిచింది ?
జ: నాలుగో సారి

అంతర్జాతీయం
09) బ్రిటన్ లో అత్యంత సంపన్నుల్లో మొదటి స్థానంలో నిలిచిన NRI లు ఎవరు ?
జ: హిందూజా కుటుంబం
(నోట్: సండే టైమ్స్ రిచ్ లిస్ట్ వార్షిక జాబితా విడుదల చేసింది. హిందూజా సోదరుల సంపద 22 బిలియన్ పౌండ్లు. అంటే దాదాపు రూ.1.98 లక్షల కోట్లు )
10) వాహనాల్లో ప్రస్తుతం ఉన్న డీజెల్, పెట్రోల్ ఇంజిన్ల స్థానంలో చౌకైగా ఉండే, పర్యావరణ హితమైన ఫ్యూయెల్ సెల్స్ పరిజ్ఞానాన్ని ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు ?
జ: వాటర్ లూ విశ్వవిద్యాలయం ( వాషింగ్టన్)
11) ఇరాన్ నుంచి దాడులను ఎదుర్కోడానికి అమెరికా పంపిన యుద్ధ నౌక పేరేంటి ?
జ: USS ఆర్లింగ్టన్
12) క్రైస్తవులకు చర్చి పన్ను ఉన్నట్టే ముస్లింల మసీదులకు మసీదు పన్ను వేయాలని ఏ దేశం నిర్ణయించింది ?
జ: జర్మనీ
13) మాడ్రిడ్ ఓపెన్ WTA ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?
జ: కికి బెర్ టెన్స్ ( నెదర్లాండ్స్ )
14) స్పెయిన్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్ లో వరుసగా మూడో టైటిల్ సొంతం చేసుకున్నది ఎవరు ?
జ: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్

 

తెలుగు వర్డ్ వెబ్ సైట్ (అన్ని రకాల వార్తల కోసం- whats app గ్రూపు)
https://chat.whatsapp.com/BIVy17lY3Ga7MIXNdQXjSB

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

 

TSPSC లేదా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని పరీక్షలకు పనికి వచ్చే జనరల్ స్టడీస్ పేపర్ ప్రిపరేషన్ విశ్లేషణ  (Useful for : Gr.1, 2, 3, 4, AEE etc., )