Friday, February 22

CURRENT AFFAIRS – MAY 11

రాష్ట్రీయం
1) కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి -ఇందిరా నగర్ లో
2) ప్రపంచంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆవిష్కరించారు ?
జ: హైదరాబాద్ లోని NTR స్టేడియంలో

జాతీయం
3) రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ వెళ్ళారు. ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని ఎవరు ?
జ: అధ్యక్షురాలు - విద్యాదేవీ భండారీ, ప్రధాని - కె.పి.ఓలి
4) 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ సంస్థలో 77శాతం వాటాను ఏ సంస్థ కొనుగోలు చేస్తోంది ?
జ: వాల్ మార్ట్
5) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
6) ఏ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం అమలుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: ఢిల్లీ
7) 2019 జూన్ వరకూ ఏడాది పాటు ఏ కేబినెట్ సెక్రటరీ పదవిని పొడిగించారు ?
జ: ప్రదీప్ కుమార్ సిన్హా
8) MSME ని విస్తరించండి ?
జ: Micro, Small and Medium Enterprises
9) NSIC ని విస్తరించండి ?
జ: National Small Industries Corporation Limited
10) PNG ని విస్తరించండి ?
జ: Piped Natural Gas
11) థోల్ లేక్ అనేది ఏ రాష్ట్ర భవనం ?
జ: గుజరాత్
12) బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: కర్ణాటక
13) ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) ఛైర్మన్ ఎవరు ?
జ: ఆర్. ఎస్ శర్మ

అంతర్జాతీయం
14) ప్రపంచం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ మధ్య చారిత్రాత్మక భేటీ ఎప్పుడు ఎక్కడ జరగనుంది ?
జ: జూన్ 12న సింగపూర్ లో
15) మలేసియా ఎన్నికల్లో గెలిచిన ఎవరు మళ్ళీ ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు ?
జ: మహాథిర్ మహమ్మద్
16) ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడిగా ఎవరు నిలిచారు ?
జ: మహాథిర్ మహమ్మద్ ( 92 యేళ్ళ వయసులో )
17) స్విట్జర్లాండ్ లో ప్రాణాంతక రసాయనాన్ని ఎక్కించుకొని స్విట్జర్లాండ్ లో ఆత్మహత్య చేసుకున్న 104యేళ్ళ శాస్త్రవేత్త ఎవరు ?
జ: డేవిడ్ గూడాల్
18) 2018 వరల్డ్ రోబో కాన్ఫరెన్స్ ఆగస్ట్ 15 నుంచి 19 వరకూ ఎక్కడ జరగనుంది ?
జ: బీజింగ్
19) 2018 మే 8న కోస్టా రీకాకి అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: కార్లోస్ అల్వరాడో
20) ప్రపంచ అథ్లెటిక్స్ డే 2018 ని ఎప్పుడు నిర్వహించారు ?
జ: మే 7
21) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( NASA) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: వాషింగ్టన్ డి.సి. (అమెరికా ) అడ్మినిస్ట్రేటర్ - జిమ్ బ్రిడెన్ స్టీన్
22) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? ప్రస్తుత మేనేజింగ్ డైరక్టర్ ఎవరు ?
జ: వాషింగ్టన్ డీ.సి. - ఎండీ - క్రిస్టీన్ లగార్డే

==========================================

Telangana exams app (ఏడాది లో 74వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న app) ఎప్పటికప్పుడు విద్య , ఉద్యోగ సమాచారం, లేటెస్ట్ నోటిఫికేషన్లు, కరెంట్ అఫైర్స్, ప్రిపరేషన్ ప్లాన్, TSPSC, తెలంగాణ స్టడీ మెటీరియల్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోస్టును మీ timeline నుంచి షేర్ చేయండి ... ఇతర వాట్సాప్ గ్రూపులు, మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams

 

Comments are closed.