Friday, May 25
Log In

CURRENT AFFAIRS – MARCH 29

రాష్ట్రీయం
1) ఇంటింటా ఆరోగ్య సర్వేని ఎప్పటి లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: జులై - ఆగస్టు నెలల కల్లా
2) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయనున్నారు ?
జ: 71
3) కొత్తగా 23 జిల్లాల్లో ఏర్పడే 300 కుపైగా గ్రామపంచాయతీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం పంచాయతీల సంఖ్య ఎంత ?
జ: 12,741
4) కొత్తగా ఏర్పడే పంచాతీయల తర్వాత అత్యధికంగా, అత్యల్పంగా ఏయే జిల్లాలో పంచాతీయులు ఉంటాయి ?
జ: నల్లగొండలో అత్యధికం ( 844), మేడ్చల్ మల్కా్జ్ గిరిలో అత్యల్పం ( 61)
5) కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ మాల ప్రాజెక్టులో తెలంగాణలో నాలుగు ప్రాజెక్టుల కోసం ఎంత మొత్తాన్ని కేంద్రం కేటాయించింది ?
జ: రూ.4,494 కోట్లు

జాతీయం
6) భారత ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలి ?
జ: 124 ఆర్టికల్
7) CJIను తొలగించాలంటే పార్లమెంటులో ఉభయ సభల్లో ఎంత మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి ?
జ: మూడింట రెండు వంతుల మెజారిటీ
8) లోక్ సభలో న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం ఎంతమంది సభ్యులు ఆమోదించాలి ?
జ: 100 మంది
(నోట్: రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేయాలి )
9) ఇప్పటి వరకూ అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటు ఎంతమంది న్యాయమూర్తులను తొలగించింది ?
జ: ఎవర్నీ తొలగించలేదు
10) ప్రజాసొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో మొదటగా 2007లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయి ?
జ: జస్టిస్ సౌమిత్రా సేన్ ( కోల్ కత్తా హైకోర్టు న్యాయమూర్తి )
(నోట్: సీజేఏ బాలక్రిష్ణన్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ధారణ తర్వాత 2009లో జస్టిస్ సేన్ తొలగింపుపై రాజ్యసభలో 187 మంది సభ్యులతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. 2011లో ఇది లోక్ సభ ఆమోదానికి వెళ్ళగా జస్టిస్ సౌమిత్రా సేన్ తన పదవికి రాజీనామా చేశారు )
11) ఏప్రిల్ 2 నుంచి రెండో విడత ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలను చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. వీటిని ఏ బ్యాంకుల్లో అమ్ముతారు ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
12) ఎయిరిండియాలో ఎంత శాతం వాటాను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 76శాతం
13) దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథంలోకి నడిపించేందుకు నీతి ఆయోగ్ ఏ పేరుతో ప్రగతి నివేదిక విడుదల చేసింది ?
జ: ఛాంపియన్ష్ ఆఫ్ ఛేంజ్
14) దేశంలో ఎన్ని వెనుకబడిన జిల్లాలు అభ్యుదయేచ్ఛ జిల్లాలుగా ఎంపికయ్యాయి ?
జ: 115 జిల్లాలు
15) కమ్యూనికేషన్స్ కి సంబంధించి అధునాత ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. దాని పేరేంటి ?
జ: జీశాట్ - 6ఏ

అంతర్జాతీయం
16) మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: విన్ మ్యింట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *