Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS MARCH 25

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఎన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేశారు ?
జ: 21
2) కాకతీయుల సైనిక స్థావరం ఎక్కడ వెలుగులోకి వచ్చింది ?
జ: హన్మకొండ సిద్ధేశ్వర గుట్టపై చెట్ల పొదల్లో

జాతీయం
3) క్షయ రహిత భారత్ ఎప్పటిలోగా సాధ్యం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు ?
జ: 2025 నాటికి ( ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి టార్గెట్ )
4) ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు మొదట ఏయే ఆఫ్రికా దేశాలను మే నెలలో పర్యటించనున్నారు ?
జ: పనామా, గ్వాటెమాలా
5) హైవేల్లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం కేంద్ర రోడ్లు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యాప్ ఏది ?
జ: సుఖద్ యాత్ర
6) హైవేల్లో అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది ?
జ: 1033
7) ఆర్కిటెక్ట్ లో నోబెల్ ప్రైజ్ గా భావించే 2018 ప్రిట్జ్ కర్ ప్రైజ్ దక్కించుకున్న భారతీయుడు ఎవరు ?
జ: బాలక్రిష్ణ దోషి
8) 2018 స్వచ్ఛ్ శక్తి 2018 సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ?
జ: కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ
9) పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ (అమెండ్ మెంట్ ) బిల్ 2017 దేనికి సంబంధించినది ?
జ: ట్యాక్స్ ఫ్రీ గ్రాట్యూటీ, మెటర్నిటీ లీవ్
10) మొదటిసారిగా కేరళ నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సదస్సు ఏ నగరంలో జరిగింది ?
జ: కొచ్చి


11) టెక్నాలజీని మారూమూల గ్రామాలకు కూడా తీసుకెళ్ళేలా న్యాయపుణ్య రథం ( వరల్డ్ ఆన్ వీల్స్ ) ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: ఆంద్రప్రదేశ్
12) 46వ అఖిలభారత పోలీస్ సైన్స్ కాంగ్రెస్ 2018 ఎక్కడ జరిగింది ?
జ: హిమాచల్ ప్రదేశ్
13) భీమ్ బంద్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: బిహార్
14) కన్వర్ శాంక్చూరీ ఎక్కడ ఉంది ?
జ: హిమాచల్ ప్రదేశ్
15) ఇస్రోని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జ: 1969లో
16) ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో భారత బ్రుందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ?
జ: పి.వి. సింధూ ( భారత పతకాన్ని ఆమె చేతబూనుతారు)


అంతర్జాతీయం
17) వరల్డ్ ఎర్త్ అవర్ ను ఏ సంస్థ నిర్వహిస్తుంది ?
జ: వరల్డ్ వైడ్ ఫర్ నేచర్
18) సైన్యంలోకి ట్రాన్స్ జెండర్స్ చేరకుండా ఏ దేశంలో నిషేధం విధించారు .
జ: అమెరికాలో
19) ఏ రెండు దేశాల మధ్య పర్పుల్ లైన్ సరిహద్దుగా ఉంది ?
జ: ఇజ్రాయెల్, సిరియా