Friday, February 22

CURRENT AFFAIRS – MARCH 24

రాష్ట్రీయం
1) రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ( టీఆర్ఎస్ సభ్యులు)
2) సీఎం కేసీఆర్ జీవితంలోని అనేక ఘట్టాలను రూపొందిస్తూ పొందుపరచిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం బుక్ ను ఎవరు రచించారు ?
జ: బొట్ల మహర్షి ( భూపాలపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ )
3) కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన తెలుగు సలహా మండలిలో చోటు దక్కించుకున్న ప్రముఖ కవి ఎవరు ?
జ: యాకూబ్
4) వెల్స్ పన్ ఇండియా లిమిటెడ్ సాంకేతిక జౌళి ఉత్పత్తుల పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తోంది ?
జ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనపల్లి
5) 2010 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య నేత కార్మికులు మూలధన వ్యయంగా తీసుకున్న మొత్తాల్లో ఎంతలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది ?
జ: 1లక్ష లోపు
(నోట్: జీఓ ఎం.ఎస్. 46ను విడుదల చేసింది )
6) వందల గంటల ముందే గుండె పోటును గుర్తించే పరికరాన్ని తయారు చేసిన పరిశోధకులు ఏ సంస్థకు చెందిన వారు .
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
7) జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ పురస్కారం అందుకున్న సిద్ధిపేటకు చెందిన సంస్థ ఏది ?
జ: శ్రీసాయి తేజ స్లమ్ సమాఖ్య
(నోట్: 33 మహిళా సంఘాలు, 345 మంది సభ్యులు ఇందులో ఉన్నారు )
8) రాయదుర్గం బయో డైవర్సిటీ పార్క్ నుంచ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దాకా (31కిమీ) మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులు చేపట్టేందుకు హైదరాబాద్ ఎయిర్ మెట్రో లిమిటెడ్ పేరుతో SPV ని ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్, ఎండీలుగా ఎవరు వ్యహరించనున్నారు ?
జ: ఛైర్మన్ గా CS ఎస్ కే జోషీ, ఎండీగా NVS రెడ్డి.


జాతీయం
9) లోక్ పాల్ ఏర్పాటు కోసం ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్ష ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: రామ్ లీలా మైదానంలో
10) ఆసియన్ మీడియా గ్రూప్ ఏటా విడుదల చేసే ఆసియాన్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కుటుంబం ఏది ?
జ: హిందూజా కుటుంబం
(నోట్: వీరి వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.2,02,250 కోట్లు )
11) ఏప్రిల్ లో నిర్వహించాలని భావించిన చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని ఇస్రో అక్టోబర్ కు వాయిదా వేసింది. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత ?
జ: రూ.800 కోట్లు
12) పశ్చిమాసియాలో మొదటిసారిగా ఏ దేశానికి ఎయిర్ ఇండియా విమాన సేవలు ప్రారంభించింది ?
జ: ఇజ్రాయెల్ (AI 139 విమానం)
(నోట్: ఎయిరిండియా CMD ప్రదీప్ ఖరోలా )
13) కర్ణాటకలో ఏ వర్గం వారిని మత అల్పసంఖ్యాకులుగా ప్రభుత్వం గుర్తించింది ?
జ: లింగాయత్ లు
14) ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, వ్యాపార దిగ్గజాలు, విద్యారంగ నిపుణులు కలసి రూ.750 కోట్లతో చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు ?
జ: లిబరల్ ఆర్ట్స్
15) ఆంధ్రప్రదేశ్ లో బీసీ కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు ?
జ: మంజునాథ్

అంతర్జాతీయం
16) అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ప్రెసిడెంట్ ట్రంప్ ఎవర్ని నియమించారు ?
జ: జాన్ బోల్టన్
(నోట్: లెఫ్టినెంట్ జనరల్ HR మెక్ మాస్టర్ ను తొలగించారు )
17) విదేశీ నైపుణ్య ఉద్యోగాలకు కీలకమైన 457(SUB CLAUSE) కేటగిరీ వీసాలను ఆస్ట్రేలియా రద్దు చేసింది. దీని స్థానంలో ఏ వీసా విధానాన్ని తీసుకొచ్చింది ?
జ: టెంపరరీ స్కిల్ షార్టేజ్ ( TSS)
18) స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఎంతశాతం అదనపు దిగుమతి సుంకాన్ని అమెరికా విధించనుంది ?
జ: స్టీల్ 25శాతం, అల్యూమినియం 10శాతం
19) రూ.35వేల కోట్ల రూపాయలతో భూషణ్ స్టీల్ ను దక్కించుకొని, భారత్లోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీగా నిలవనున్న సంస్థ ఏది ?
జ: టాటా స్టీల్
20) ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచింది ?
జ: 60 బిలియన్ డాలర్లు
21) ఎన్ని రకాల అమెరికా ఉత్పత్తులపై ఇంపోర్ట్ ట్యా్క్స్ ను విధించాలని చైనా భావిస్తోంది ?
జ: 128 రకాలు
22) ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో గెలవడం ద్వారా 2019లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్ లో ఆడేందుకు రెండోసారి అర్హత సాధించిన దేశం ఏది ?
జ: ఆఫ్గనిస్తాన్
(నోట్: ఇటీవలే వెస్టిండీస్ కూడా అర్హత సాధించింది )
23) 2019లో ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచ కప్ ఒన్డే క్రికెట్ టోర్నీలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ?
జ: 10 దేశాలు
24) 2015లో జరిగిన ప్రపంచ కప్ ఒన్డే క్రికెట్ టోర్నీలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ?
జ: 14 జట్లు
25) 1975 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ కప్ ఒన్డే క్రికెట్ టోర్నీలు ఎన్ని జరిగాయి ?
జ: 11 టోర్నీలు

 

సర్కారీ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ?

ఖచ్చితంగా యూనిఫామ్ జాబ్ కొట్టాలని లక్ష్యం ఉందా ?

రోజుకి 8-10 గంటలు చాలు... 20 గంటలు అక్కర్లేదు !

కొశ్చన్ పేపర్ కి అనుగుణంగా ప్లానింగ్... బట్టీ సంస్కృతి వద్దు !

SI/PC/GR.IV/VRO కోచింగ్ మొదలైంది... వివరాలకు  క్లిక్ చేయండి: http://tsexams.com/coaching-starts/