Tuesday, July 17
Log In

CURRENT AFFAIRS – MARCH 23

రాష్ట్రీయం
1) రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకానికి గతంలో ఉన్న రైతులక్ష్మి పేరును ఏ విధంగా మార్చారు ?
జ: రైతు బంధు
2) మలేరియాని తొలిదశలోనే గుర్తించే పరికరానికి GYTI2018 అవార్డు ఎవరికి దక్కింది ?
జ: ప్రొ.శివ గోవింద్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం

జాతీయం
3) భారత్ కి చేరుకున్న జర్మనీ అధ్యక్షుడు ఎవరు ?
జ: ఫ్రాంక్ వాల్టర్ స్టెన్ మేయర్
4) దేశీయంగా రూపొందించిన సీకర్ సాయంతో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ఎక్కడ పరీక్షించారు ?
జ: రాజస్థాన్ లోని పోఖ్రాన్
5) జీకే రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఎవరికి ప్రదానం చేశారు?
జ: కరణ్ థాపర్
6) విదేశాంగ విధానం, దృక్పథం, ప్రాధాన్యాలను వివరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: విదేశీ ఆయా ప్రదేశ్ కే ద్వార్
7) కర్ణాటకలోని ఏ రెండు కులాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ లోకి చేరుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: పరివార, తల్వార
(note: నాయక అనే తెగలకు ఇవి పర్యాయపదాలు)
8) పనస పండును ఏ రాష్ట్ర అధికార పండుగా ప్రకటించారు ?
జ: కేరళ
9) ప్రపంచంలోనే అతి పొడవైన ఇసుకరాతి గుహను ఎక్కడ కనుగొన్నారు ?
జ: మేఘాలయలో
(నోట్: క్రేమ్ పూరిగా పిలిచే ఈ గుహ పొడవు 24,583 మీటర్లు )
10) అంతర్జాతీయ యెగా ఫెస్ట్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: న్యూ ఢిల్లీలో
(నోట్: కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్ దీన్ని టల్కతోర స్టేడియంలో ప్రారంభించారు )
11) పరమ వీర చక్ర అవార్డులు అందుకున్న వారి వివరాలతో కూడిన ఏ పుస్తకాన్ని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది ?
జ: పరమ్ వీర్ పర్వానే
(నోట్: ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. డాక్టర్ ప్రభాకిరణ్ జైన్ దీన్ని రచించారు )
12) కొత్త ప్రత్యక్ష పన్నుల విధానంపై చట్టాలను రూపొందించేందుకు ఎవరి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది ?
జ: అర్వింద్ మోడీ ( CBDT మెంబర్ )
13) బీహార్ 106వ వ్యవస్థాపక దినోత్సవం యొక్క థీమ్ ఏంటి?
జ: Centanary of Champaran Satyagraha and Elimination of Dowry and Child Marriage

అంతర్జాతీయం
14) అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని మార్చి 22న నిర్వహించారు. దీని థీమ్ ఏంటి ?
జ: Nature for Water
15) జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: అర్జెంటీనా
16) మెర్సర్ క్వాలిటీ లివింగ్ సర్వే 2018 లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ?
జ: వియన్నా
17) వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ని మార్చి 21న జరుపుకున్నారు. థీమ్ ఏంటి ?
జ: What I bring to my community

Friends,

తెలంగాణ ఎగ్జామ్స్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో SI/PC/GROUP.IV/VRO కోచింగ్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి.  ప్రస్తుతం ఇంట్రో క్లాసులు నడుస్తున్నాయి.  వచ్చే మంగళ, బుధవారాల నుంచి పూర్తి స్థాయి క్లాసులు మొదలవుతాయి. మన కోచింగ్ సెంటర్ లో చేరాలనుకునే వారు వెంటనే సంప్రదించగలరు.  ఇప్పటికే అడ్వాన్స్ పే చేసి సీట్ బుక్ చేసుకున్నవారిలో కొందరు ఇంకా హాజరు కాలేదు.  కావున మీరు కూడా మంగళవారం నుంచి క్లాసులకు రాగలరు. (సోమవారం శ్రీరామ నవమి శెలవు)