Friday, February 22

CURRENT AFFAIRS – MARCH 21

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ?
జ: 68 (మొత్తం 141కి చేరుకుంటాయి )
(నోట్: 63 నగర పంచాయతీ 5 మున్సిపాలిటీలు )
2) డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వృత్తిదారులకు నెలకు ఎంతమొత్తం ఫించన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ?
జ: రూ.వెయ్యి
(నోట్: రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వ ప్రాథమిక అంచనా )
3) సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయడానికి నాసా త్వరలో ఓ రాకెట్ ను సూర్యుడి పైకి పంపనుంది. ఈ ప్రయోగం వీక్షించడానికి రాష్ట్రం నుంచి ఎంపికైన విద్యార్థి ఎవరు ?
జ: అబీర్ ( సంరారెడ్డి జిల్లా జహీరాబాద్ విద్యార్థి )
4) తపాలా బిళ్ళలను సేకరించే అలవాటున్న (6-9 తరగతుల విద్యార్థుల)లకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన కింద ఉపకార వేతనం ఇచ్చేందుకు ఎంతమొత్తం స్కాలర్ షిప్ ఇవ్వనున్నారు ?
జ: రూ.6 వేలు ( 40 మంది ఎంపికయ్యారు )
5) దేశ వ్యాప్తంగా 62 ఉన్నత విద్యాసంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని యూజీసీ ప్రకటించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఏయే యూనివర్సిటీలకి చోటు దక్కింది ?
జ: ఉస్మానియా, HCU, కాకతీయ, నల్సార్, ఇఫ్లూ

జాతీయం
6) Festival of Innovation and Entrepreneurship (FINE) 2018 సదస్సును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: న్యూ ఢిల్లీ
7) ఇరాక్ లోని మోసుల్ లో కిడ్నాపైన 40 మంది భారతీయులను ఐసిస్ ఉగ్రవాదులు చంపేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరి కిడ్నాప్ ఎప్పుడు జరిగింది ?
జ: జూన్ 15, 2014
8) ఒడిశా గవర్నర్ ఎస్ సి జమీర్ పదవీకాలం ముగిసింది. ఆయన స్థానంలో ఎవరికి ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు ?
జ: బిహార్ గవర్నర్ సత్యపాల్ మలిక్
9) మూడో మైన్స్ అండ్ మినిరల్స్ జాతీయ సదస్సు ఏ సిటీలో జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ
10) దేశంలో మొదటిసారిగా ప్రపంచవ్యాప్త కవరేజితో హెల్త్ ప్లాన్ తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ?
జ: న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్
11) ఇటీవల చనిపోయిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ కవర్ ను ఎక్కడ రిలీజ్ చేశారు ?
జ: విజయవాడ పోస్టల్ శాఖ
12) అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఉత్తర ప్రదేశ్
13) దుద్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఉత్తర ప్రదేశ్
14) హిర్పోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: జమ్ము అండ్ కశ్మీర్
15) యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏది ?
జ: Badhti ka naam zindagi

అంతర్జాతీయం
16) 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం లిబియా నియంత గడాఫీ నుంచి ధన సాయం అందుకున్నారన్న ఆరోపణలతో అరెస్టయిన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఎవరు ?
జ: సర్కోజీ
17) శ్రీలంక కొలొంబోలో ప్రేమదాస స్టేడియంలో నిదహాస్ క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న దేశం ఏది ?
జ: ఇండియా
18) జపాన్ కరెన్సీ ఏది ?
జ: యెన్
19) ఇండియన్ వెల్స్ మాస్టర్స్, 2018 ఏ నగరంలో జరిగాయి ?
జ: కాలిఫోర్నియా (అమెరికా)