Friday, May 24

CURRENT AFFAIRS – MAR 7

తెలంగాణ
01) మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ఎంతమంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది ?
జ : 14 విభాగాల్లో 21 మందికి
02) అవార్డులకు ఎంపికైన వారి వివరాలు
సాహిత్యం - డాక్టర్ ప్రేమ లత, తస్నీమ్ జోహెర్
నృత్యం : డాక్టర్ కె.రత్నశ్రీ
సంగీతం : సుత్రానే కీర్తిరాణి
జానపద కళలు : శివమ్మ, మోతం జంగమ్మ
చిత్రలేఖనం : ఆచార్య గీత
హరికథ : పద్మాలయ ఆచార్య
03) స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2019 పోటీల్లో రాష్ట్రం నుంచి ఉత్తమంగా ఎంపికైన మున్సిపాలిటీలు ఏవి ?
జ: సిద్ధిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాది గూడ
04) పోటీలో వివిధ అంశాల ఆధారంగా దేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: ఎనిమిది
05) ఎదుగుదల లోపంతో ఉండే పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది ?
జ: ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ
06) ఎదుగుదల లోపంతో బాధపడుతున్న ఐదేళ్ళ లోపు చిన్నారులు దేశంలో 33.3శాతం ఉంటే, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ?
జ: 28.1శాతం మంది
07) ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డ్ 2019 రాష్ట్రంలో ఏ సంస్థకు లభించింది ?
జ: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ( న్యాక్ )

జాతీయం
08) దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనం రెట్టింపు కానుంది. నిపుణుల కమిటీ సూచించిన ప్రకారం కనీస వేతనం రోజుకి ఎంత ?
జ: ప్రస్తుతం రూ.176. గరిష్టంగా రూ.447 వరకూ పెరుగుతుంది
09) తెలుగు రాష్ట్రాల్లో కనీస వేతనం ఎంతగా ఉండాలని నిపుణుల కమిటీ సూచించింది ?
జ: రోజుకి రూ.380, నెలకు రూ.9,880
10) స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో భాగంగా 10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలకు స్వచ్ఛ్ ర్యాంకింగ్స్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ?
జ: 2016లో
11) 2019 స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని నగరాలు పోటీ పడ్డాయి ?
జ: 4,237 మున్సిపాలిటీలు
12) దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా ఏది నిలచింది ?
జ: ఇండోర్ (మధ్యప్రదేశ్ ) (మూడోసారి ఎంపికైంది)
13) స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2019 లో అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా 2,3, స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి ?
జ: అంబికాపూర్ ( ఛత్తీస్ గఢ్ ), మైసూర్ (కర్ణాటక)
14) ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు ?
జ: హర్ దీప్ సింగ్ పురి
15) హైదరాబాద్ లో మరణించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి ఏ కేసులో చరిత్రాత్మక తీర్పు చెప్పారు ?
జ: ఎస్ఆర్ బొమ్మై కేసులో

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/