Friday, February 22

CURRENT AFFAIRS MAR 30

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఏ ఎత్తిపోతల పథకానికి కేంద్ర వన్య ప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి ఇచ్చింది ?
జ: సీతారామ ఎత్తిపోతల పథకం
2) 2018-19 సంవత్సరానికి స్త్రీనిధి రుణ ప్రణాళికను ఎంతగా నిర్ణయించారు ?
జ: రూ.2300 కోట్లు
3) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ కు మరో జాతీయ అవార్డు దక్కింది.  స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ గ్రాహి అవార్డును ఎవరు అందుకున్నారు ?
జ: జూపల్లి నీరజ
(నోట్: 2016-17 సం.నికి ఈ గ్రామం జాతీయ గ్రామ సశక్తీకరణ్ అవార్డును ఇటీవలే పొందింది)


జాతీయం
4) ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన GSAT-6A ఉపగ్రహం GSLV సరిస్ లో ఎన్నవది ?
జ: 12వది
5) GSLV F08 లో మొదటిసారి ఉపయోగించిన ఇంజన్ ఏది ?
జ: వికాస్ ఇంజన్
(నోట్: మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ లో ఈ ఇంజన్ ను రూపొందించారు )
6) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) ప్రస్తుత అధిపతి ఎవరు ?
జ: డాక్టర్ కె.శివన్
7) టైమ్స్ మేగజైన్ ఏటా విడుదల చేసే ప్రపంచ స్థాయిలో వందమంది అత్యంత ప్రభావ వంతుల జాబితాలో మన దేశం నుంచి ఎవరి పేరును ప్రతిపాదించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
8) ఏడో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా మొదటిసారిగా LTC ని రైల్వే ఉద్యోగులకు కూడా వర్తింపజేయనున్నారు.  ఎన్నేళ్ళకోసారి రైల్వే ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా వెళ్ళే సౌకర్యాన్ని LTC ద్వారా కల్పించనున్నారు ?
జ: నాలుగేళ్ళ కోసారి
9) వీడియోకాన్ సంస్థకు రుణం ఇచ్చిన వివాదంలో ICICI మేనేజింగ్ డైరక్టర్ పై వివాదం చెలరేగింది.  ప్రస్తుతం ICICI MD ఎవరు ?
జ: చందా కొచ్చర్
10) రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరులో రామ్ జీ పదాన్ని చేర్చాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఉత్తర ప్రదేశ్
11) ఆవులకు వాటి యజమానులు నెలవారీ రుసుములు చెల్లించి వసతి గృహాల్లో ఆశ్రయం కల్పించే అవకాశాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ?
జ: హరియాణా
12) బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కి గ్రూప్ - 1 కేడర్ తో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయం
13) బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.  ఆయన ఆత్మకథతో వచ్చిన పుస్తకం ఏది ?
జ: ద జర్నీ స్టీవ్ స్మిత్
14) వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి కొత్త సెట్టింగ్స్ ను అందుబాటులోకి తెచ్చిన సామాజిక దిగ్గజం ఏది ?
జ: ఫేస్ బుక్
15) మానవ శరీరంలో కొత్త అవయవాన్ని అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పేరేంటి ?
జ: ఇంటర్ స్టిటియం
(నోట్: ఇది మన దేహంలోని ముఖ్యమైన అవయవాలు, కణజాలాల చుట్టూ విస్తరించింది ఉంటుంది )

 

SI/PC/GR.IV/VRO కోచింగ్ మొదలైంది
8-10గంటల Studyతో Perfect Planning
https://tsexams.com/coaching-starts/

RRB MOCK TESTS, GRAND TESTS

అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలపై స్పెషల్ క్లాసులు

http://tsexams.com/rrb-mock-tests-grand-tests/