Friday, February 22

CURRENT AFFAIRS – MAR 27

రాష్ట్రీయం
1) రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసినది ఎవరు ?
జ: దేశాయ్ ప్రకాశ్ రెడ్డి
2) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చే ఐదేళ్ళ కాలానికి ప్రసార హక్కుల్ని దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవర్ని నియమించుకోనుంది ?
జ: జూనియర్ ఎన్టీఆర్

జాతీయం
3) రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఏ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది ?
జ: 2011 లెక్కలు
4) LIC కి ఎన్ని వేల కోట్ల ప్రభుత్వ హామీతో రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లను విడుదల చేయనున్నారు ?
జ: రూ.5 వేల కోట్లు
5) భారత్ లో పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకాల కోసం రూ.80కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దేశం ఏది ?
జ: అమెరికా
6) మొబైల్, బ్రాడ్ బ్యాండ్ డేటా డౌన్ లోడ్ వేగానికి సంబంధించి ప్రపంచంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందని ఓక్లా స్పీడ్ టెస్ట్ సూచీ వెల్లడించింది ?
జ: 109 వ స్థానం
(నోట్: 2017 నవంబర్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 8.80 MBPS, 2018 ఫిబ్రవరిలో 9.01 MBPS )
7) చైనా, పాకిస్తాన్ కి వలస వెళ్ళి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వీరిని ఏమంటారు ?
జ: కాందిశీకులు
8) భగత్ సింగ్ ను ఉరి తీసిన 87 యేళ్ళ తర్వాత తొలిసారిగా ఆ కేసుకు సంబంధించిన దస్త్రాలను ప్రదర్శనకు పెట్టిన దేశం ఏది ?
జ: పాకిస్థాన్
(నోట్: బ్రిటీష్ పోలీస్ అధికారి శాండర్స్ ను హత్య చేసినందుకు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్ లో ఉరి తీశారు )
9) ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీకి రాజ్యసభలో ఎంతమంది సభ్యుల బలం ఉంది ?
జ: 68 మంది సభ్యులు
(నోట్: రాజ్యసభలో మొత్తం సభ్యుల బలం : 245 మంది సభ్యులు, ఎన్డీఏ బలం 86 మంది ఎంపీలు. కాంగ్రెస్ బలం 54 మంది, యూపీఎకి 68 మంది సభ్యులు )
10) ఏడో ఇండియా ఈజిప్ట్ జాయింట్ కమిషన్ మీటింగ్ ఏ సిటీలో జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ


11) పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ మార్గాల కోసం గ్రీన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఢిల్లీ
12) ఇన్సూరెన్స్ పాలసీలకు ఆధార్ ను అనుసంధానించేందుకు గడువు తేదీని పెంచిన సంస్థ ఏది ?
జ: IRDAI ( Insurance Regulatory and Development Authority of India )
13) 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువమంది బిచ్చగాళ్ళు ఉన్నారు ?
జ: పశ్చిమ బెంగాల్
14) ఏప్రిల్ 14న ఎవరి జయంతి సందర్భంగా సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం ?
జ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
15) ఏ దేశంలో భారతీయ బ్యాంకుల బ్రాంచీలు అధికంగా ఉన్నాయి ?
జ: బ్రిటన్ లో (32 బ్రాంచీలు )
16) Honours Yours Trust - ఈ ట్యాగ్ లైన్ కలిగిన బ్యాంక్ ఏది ?
జ: యూకో బ్యాంక్
17) ISASF జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్షిప్ లో బంగారు పతకం గెలుచుకున్న భారతీయ షూటర్ ఎవరు ?
జ: అనిశ్ భన్వాలా
18) ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో వచ్చే నెల 4 నుంచి 15 వరకూ జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారత్ బృందంలో ఎంతమంది ఉన్నారు ?
జ: 325 మంది
(నోట్: 221 మంది అథ్లెట్లు, 58 మంది కోచ్ లు)

అంతర్జాతీయం
19) తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి పదేళ్ళు జైలుశిక్ష విధించేలా పార్లమెంటలో చట్టం ప్రవేశపెట్టిన దేశం ఏది ?
జ: మలేసియా
(నోట్: ప్రధాని నజీబ్ రజాక్)
20) 60మంది రష్యా దౌత్యాధికారులను వెలివేసిన దేశం ఏది ?
జ: అమెరికా
21) 2018 ఫార్ములా ఒన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: ఆస్ట్రేలియా
22) మార్చి 24 నుంచి 2018 ఆసియాన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: మయన్మార్