Friday, February 22

CURRENT AFFAIRS – MAR 22

రాష్ట్రీయం
1) 100 ఎకరాల్లో వరంగల్ లో గిరిజన సైనిక స్కూల్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: అశోక్ నగర్ లో
2) రాష్ట్రంలో ఆక్సిజన్ పార్క్ ను 70 ఎకరాల్లో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: మేడ్చల్ మండలం కండ్లకోయ దగ్గర
3) దేశంలో నాణ్యమైన జీవనానికి అత్యంత అనువైన నగరంగా ఏది నిలిచింది ?
జ: హైదరాబాద్, పుణె
(నోట్: మెర్సర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసింది. హైదరాబాద్ వరుసగా నాలుగో ఏడాది కూడా మొదటి స్థానం దక్కించుకుంది)

జాతీయం
4) ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని పేరేంటి ?
జ: ఆయుష్మాన్ భారత్
5) దేశ భద్రతను కట్టుదిట్టం చేయడంపై పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ ఇటీవల నివేదిక సమర్పించింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: మురళీ మనోహర్ జోషి
6) కేంబ్రిడ్జ్ అనలికా (CA) అనేది దేనికి సంబంధించినది ?
జ: ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని నిర్ధారించిన సంస్థ
7) జార్ఖండ్ లోని ఏ జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ?
జ: దియోఘర్
8) 2019లో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరగనుంది ?
జ: మధ్యప్రదేశ్
9) నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?
జ: ఒడిషా
10) పోషన్ అభియాన్ పేరుతో మొదటిసారిగా న్యూఢిల్లీలో వర్క్ షాప్ ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది ?
జ: Ministry of Women and Child Development
11) ఇటీవల చనిపోయిన కేదర్ నాథ్ సింగ్ ఏ భాషకు చెందిన కవి ?
జ: హిందీ
12) 2018 ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు ?
జ: మణిపూర్
13) ఇటీవల మరణించిన సునీల్ శర్మ ఏ రంగానికి చెందిన వారు ?
జ: జర్నలిజం
14) సలాల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ ను జమ్మూకశ్మీర్ లో ఏ నదిపై నిర్మించారు ?
జ: చీనాబ్

అంతర్జాతీయం
15) ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగంతో (మ్యాక్ 25) ప్రయాణించే విమానాన్ని ఏ దేశం తయారు చేస్తోంది ?
జ: చైనా
(నోట్: గంటకు 30,625 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు )
16) అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు ఎంత శాతానికి పెరిగాయి ?
జ: పావు శాతం
17) అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ఎవరు ?
జ: జెరోమ్ పావెల్
18) టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతకు ఓవరాల్ ప్రైజ్ మనీ ఎంతకు చేరింది ?
జ: 4 కోట్ల యూరోలు ( రూ.17 కోట్ల 62 లక్షలు )
19) సర్ ఐజాక్ న్యూటన్, ఛార్లెస్ డార్విన్ తో సమానమైన గౌరవం ఇస్తూ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రదేశం పేరేంటి ?
జ: లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే
20) ప్రపంచ కవితా దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు ?
జ: మార్చి 21
21) ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ యొక్క థీమ్ ఏంటి ?
జ: Share Happiness
22) భూమికి సంబంధించిన శాటిలైట్ సమాచారం పంచుకోడానికి యూరోపియన్ యూనియన్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ?
జ: ఇండియా
23) ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు ?
జ: మార్చి 20