Monday, July 22

CURRENT AFFAIRS – MAR 14

తెలంగాణ
01) రాష్ట్రంలో యాసంగి సాగును ఎన్ని ఎకరాల లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది ?
జ: 13.38 లక్షలు
02) దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ లో మొదటిసారిగా మహిళా గూడ్స్ రైలు గార్డుగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: టీ మాధవి
03) 17-21 యేళ్ళ మధ్య వయస్సున కౌమార బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఇక్రిసాట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఏది ?
జ: ఫెఫా గర్ల్స్ ప్రాజెక్ట్
04) పునర్ ముద్రించిన పద్మనాయక వైజయంతి పుస్తకాన్ని ఉస్మానియా వర్సిటీలో ఆవిష్కరించారు. దీన్ని ఎవరు సంకలనం చేశారు ?
జ: కోటగిరి బుచ్చినాయన

జాతీయం
05) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించే ఎంతమందికి ఇస్రో అవార్డులను ప్రదానం చేసింది ?
జ: 96 మందికి (బెంగళూరులోని అంతరిక్ష భవన్ లో )
06) అమెరికా మిలటరీ మొదటి బెటాలియన్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ (వైమానిక విభాగం), జాతీయ భద్రతా దళం ( NSG) సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని NSG కేంద్రంలో
07) ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినప్పటికీ వీటిని రిలీజ్ చేసే అధికారం ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతికి
08) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది ?
జ: ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 14 ప్రకారం
09) సమాజ సేవ కోసం విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ తన వాటాల్లో 34శాతం కేటాయించారు. దీంతో ఎంత మొత్తాన్ని ఫౌండేషన్ కు కేటాయించనున్నారు ?
జ: రూ.52,700 కోట్లు
10) LIC - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: MR కుమార్

అంతర్జాతీయం
11) వాయు కాలుష్యంపై పోరాటం చేసేందుకు 8 అత్యవసర బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది ?
జ: దక్షిణ కొరియా

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(MAINS) - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

కొంతమంది off line టెస్టులు అడుగుతున్నారు.  బయట ఇనిస్టిట్యూట్స్ లో నిర్వహించే OFF LINE టెస్టులన్నీ గ్రాండ్ టెస్టులే.  అందువల్ల గ్రాండ్ టెస్టుల్లో అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే అవకాశం ఉండదు.  మేం  సబ్జెక్ట్ వారీగా లెసన్స్ కవర్ చేయడం వల్ల... మీరు ఓ ప్రణాళిక ప్రకారం చదువుకొని మాక్ టెస్టులు రాసుకోడానికి అవకాశం ఉంటుంది.  దాంతో మీరు చదివే ప్రతి లెసన్ కీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఉంటుంది.  దయచేసి ఈ తేడాని గమనించండి.  Offline టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసినప్పటికీ... ఈ ఆన్ లైన్ టెస్టులతో ఉన్న ప్రయోజనాన్ని గుర్తించండి.

మా మాక్ ఎ గ్జామ్స్ ఎలా ఉంటాయి ? ఈ వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=grZO1YKRUfU