Monday, July 22

CURRENT AFFAIRS – MAR 08

తెలంగాణ
01) మహిళల భద్రత, చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా లాంటి కేసేుల దర్యాప్తును స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వింగ్ ఏది ?
జ: ఉమెన్ సేఫ్టీ వింగ్
02) ఎవరి ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు కానుంది?
జ: ఐజీపీ స్వాతి లక్రా
03) డేటా చోరీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ చీఫ్ ఎవరు ?
జ: ఐసీ స్టీఫెన్ రవీంద్ర
04) రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: రాజేశం గౌడ్
05) స్టార్టప్ ల స్థాపనలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో వీహబ్ ను ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2018 మార్చి 8న
06) తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పదవిలో ఎవరు ఉన్నారు ?
జ: కోలేటి దామోదర్ గుప్తా

జాతీయం
07) కేంద్రం మొదటిసారిగా రూ.20 నాణేన్ని ఆవిష్కరించింది. దీనిపై ఉన్న బహుభుజ ఆకృతిలో ఎన్ని కోణాలు ఉన్నాయి ?
జ: 12 కోణాలు
08) కేంద్రం ఏయే కొత్త కాయిన్స్ సిరీస్ లను విడుదల చేసింది ?
జ: రూ.1,2,5, 10 నాణేలు
09) దేశంలో మహిళా శ్రామికుల సంఖ్య గడచిన 13యేళ్ళల్లో ఎంత శాతానికి తగ్గింది ?
జ: 36శాతం నుంచి 26 శాతానికి తగ్గింది
10) వినియోగదారుల ధృవీకరణ కోసం (KYC) ఆధార్ సర్వీసులు వినియోగించుకోడానికి వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్ కు ఎంత మొత్తం చెల్లించాలి ?
జ: రూ.20 లు
11) ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా నిర్వహించిన రెండో లింగ సమానత్వ సదస్సు 2019 సందర్భంగా పని ప్రదేశంలో మహిళలు అనే విభాగంలో హైదరాబాద్ కు చెందిన ఏ ఐటీ సేవల కంపెనీకి అవార్డు దక్కింది ?
జ: సైయెంట్ లిమిటెడ్
12) పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కు రూ.500 కోట్లు జరిమానా విధించినది ఎవరు ?
జ: జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT)

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/