Saturday, March 23

CURRENT AFFAIRS – JUNE 9

రాష్ట్రీయం
01) శాతవాహన, మౌర్యుల కాలానికి చెందిన ఖరీదైన పనిముట్లు, పరికరాలు, నాణేలకు తొలి చారిత్రక యుగస్థావరంగా రాష్ట్రంలోని ఏ గ్రామం నిలుస్తోందని పురావస్తు శాఖ ప్రకటించింది.
జ: పెద్దపల్లి జిల్లాలోని పెద్ద బొంకూర్
02) తొలి చారిత్రక యుగ స్థావరంగా చెబుతున్న పెద్ద బొంకూరులో ఇటీవల ఎన్ని ప్రాచీన వస్తువులను వెలికి తీశారు ?
జ: 920 వస్తువులు
03) కీమో థెరపి లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేటప్పుడు అంటువ్యాధులు రాకుండా రోగికి పోసోకోనజోల్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీనికి నాట్కో ఫార్మా జనరిక్ ఇంజక్షన్లు తయారు చేసింది. వాటి పేరేంటి ?
జ: పోసానాట్

జాతీయం
04) భారత్ భూగర్భ జలాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా ఎక్కువగా రేడియో ధార్మిక పదార్థాలు కలసి ఉన్నట్టు ఏ జర్నల్ లో అంశం ప్రచురితమైంది ?
జ: ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్
05) భారత్ భూగర్భ జలాల్లో మోతాదుకు మించిన రేడియో ధార్మికత ఉన్నట్టు గుర్తించిన పరిశోధకులు ఏ విశ్వవిద్యాలయానికి చెందిన వారు ?
జ: డ్యూక్ విశ్వవిద్యాలయం (అమెరికా)
06) భారత్ లో ఒక లీటరు తాగు నీటిలో ఎన్ని మైక్రో గ్రాముల యురేనియం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాత్కాలిక ప్రమాణాన్ని నిర్దేశించింది ?
జ: 30 మైక్రో గ్రాములు
07) భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ఏమని పేరు పెట్టారు ?
జ: కె2-236
08) అణు ఇంధన సంస్థ ( NFC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ?
జ: దినేశ్ శ్రీవాత్సవ
09) దేశీయ బోఫోర్స్ గా పిలిచే మొదటి భారతీయ దీర్ఘశ్రేణి శతఘ్ని తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకొని సైనికుల అమ్ములపొదిలోకి వెళ్తోంది. దాని పేరేంటి ?
జ: ధనుష్
(నోట్: మొత్తం 414 ధనుష్ శతఘ్నులను గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ సైన్యానికి అందజేయనుంది )
10) దేశంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 5 భారతీయ రిజర్వ్ పోలీస్ ( IRP) బెటాలియన్లలో జమ్ముకశ్మీర్ ప్రాంతాల వారికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: 60శాతం
11) 2016 ఆగస్టు 24న జమ్ముకశ్మీర్ లోని వైష్ణోదేవీ క్షేత్రం దగ్గర కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణాలకు తెగించి రక్షణ చర్యల్లో పాల్గొని చనిపోయిన CRPF జవాన్ హర్విందర్ సింగ్ కు ఏ పతకం దక్కింది ?
జ: ప్రధానమంత్రి పోలీస్ పతకం
12) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి పార్లమెంటేరియన్ ఏపీలోని విశాఖ జిల్లాలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: కందాళ సుబ్రహ్మణ్య తిలక్

అంతర్జాతీయం
13) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చైనా అత్యున్నత పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ అందజేశారు. అవార్డు పేరేంటి ?
జ: ఫ్రెండ్ షిప్ మెడల్
14) ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాల కోటాలో కొత్తగా ఎన్నికైన నాలుగు దేశాలు ఏవి ?
జ: డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా

 

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://telanganaexams.com/mock-tests/

రైల్వేలో గ్రూప్ - సి, డి ఉద్యోగాలకు గ్రాండ్ టెస్టులు, అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి: https://telanganaexams.com/rrb-gt-tests/