Saturday, March 23

CURRENT AFFAIRS – JUNE 8

రాష్ట్రీయం
01) వరి పరిశోధనలపై ప్రొ.జయశంకర్ విశ్వ విద్యాలయంతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ ఏది ?
జ: ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI)
02) ఈ ఏడాది నుంచి తెలుగు తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో 1, 6 తరగతి విద్యార్థుల కోసం సరళంగా పుస్తకాలు రూపొందించిన సంస్థ ఏది ?
జ: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ( SCERT)
03) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 120 ఎకరాల్లో ఏ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ?
జ: లాజిస్టిక్ పార్క్
04) వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్విహించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా రాష్ట్రం75 గ్రామాల్లో అమలు చేయనున్న పథకం ఏది ?
జ: కృషి కళ్యాణ్

జాతీయం
05) షాంఘై సహకార సంస్థ (SCO) 18వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చైనా వెళ్తున్నారు. ఈ సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: కింగ్ డావోలో
06) త్రిపుర అదనపు బాధ్యతలు స్వీకరించిన బెంగాల్ గవర్నర్ ఎవరు ?
జ: కె.ఎన్. త్రిపాఠి
(నోట్: ప్రస్తుత త్రిపుర గవర్నర్ తథాగతరాయ్ ని తప్పించారు )
07) బాలల సంరక్షణ కోసం ఇప్పటికే ఉన్న 88 రైల్వేస్టేషన్లతో పాటు ఎన్ని స్టేషన్లలో సహాయ కేంద్రాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది ?
జ: 174 సహా కేంద్రాలు
08) ప్రస్తుత భారత రైల్వే బోర్డు ఛైర్మన్ ఎవరు ?
జ: అశ్వని లోహానీ
09) దేశవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో రూ.4 వేల కోట్లతో 5 లక్షల వైఫై హాట్ స్పాట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిని ఏ కార్యక్రమం కింద చేపడుతున్నారు ?
జ: భారత్ నెట్
10) భారత కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ వార్షిక ఆదాయాన్ని పదో ఏడాది కూడా ఎంతకు పరిమితం చేసుకున్నారు ?
జ: రూ.15 కోట్లు
(నోట్: రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఛైర్మన్ హోదాలో ఆయనకు ఏటా మరో 24 కోట్లు వస్తున్నా దాన్ని వదులుకుంటున్నారు )
11) బ్రిక్స్ దేశాల్లోని మొదటి 20 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్న నాలుగు భారతీయ వర్సిటీలు ఏవి ?
జ: IIT బాంబే (9), IISC బెంగళూరు ( 10), IIT ఢిల్లీ (17), IIT మద్రాస్ (18)
12) 2016-17, 2017-18 సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏ అవార్డు దక్కింది ?
జ: పాలి ఉమ్రిగర్
13) BCCI తొలిసారిగా ప్రవేశపెట్టిన ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఎవరికి దక్కాయి ?
జ: 2016-17 - హర్మన్ ప్రీతి కౌర్
2017-18 - స్మృతి మంధాన

అంతర్జాతీయం
14) న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నది ఎవరు ?
జ: మైక్ హెసన్
15) మహిళలు తమని తాము రక్షించుకునేందుకు భద్రతా పరికరాన్ని తయారు చేసిన భారత యువ ఔత్సాహికుకు ఐక్యరాజ్యసమితి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. దాని పేరేంటి ?
జ: ఉమెన్ సేఫ్టీ ఎక్స్ ప్రైజ్
(నోట్: దీన్ని భారత సంతతికి చెందిన అను, నవీన్ జైన్ ఎక్స్ ప్రైజ్ సంస్థతో కలసి తయారు చేశారు )