Saturday, March 23

CURRENT AFFAIRS – JUNE 7

రాష్ట్రీయం
01) సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ?
జ: ఇల్లెందులో 60 మెవా
రామగుండంలో 50మెవా
మణుగూరులో 30మెవా
జైపూర్ లో 10మెవా

జాతీయం
02) దేశంలో సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంత బెయిలౌట్ ప్రకటించింది ?
జ: రూ.8,500 కోట్లు
03) అలహాబాద్ లో ఏ నదిపై 10కిమీ బ్రిడ్జి (6 లేన్లు) నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: గంగా నదిపై
04) ఇల్లు కొనుగోలుదారులకు కూడా రుణదాత హక్కులు లభించేలా కొత్త దివాలా స్మృతి బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ బిల్లు పేరేంటి ?
జ: రుణాలు చెల్లించలేని అశక్తత, దివాల స్మృతి (సవరణ) అత్యవసర ఆదేశాలు - 2018 (Insolvency and Bankruptcy Code- IBC)
05) కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ ల్యాడ్స్ ) పై రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్ ఎవరు ?
జ: పి.జే. కురియన్
06) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఎంతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ?
జ: 7.3శాతం
07) పరపతి సమీక్షా విధానంలో భాగంగా రిజర్వు బ్యాంకు రెపోరేటును ఎంతశాతం పెంచింది ?
జ: 0.25 (పావు) శాతం
08) ప్రస్తుత ఆర్థిక సంవతర్సంలో వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది ?
జ: 7.4శాతం
09) స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (సెజ్) పాలసీని అధ్యయనం చేయడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓ కమిటీని నియమించింది. ఇందులో తెలంగాణ, ఏపీలకు స్థానం కల్పించింది. అయితే ఈ కమిటీకి ఎవరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు ?
జ: బాబా కల్యాణీ (భారత్ ఫోర్డ్ సంస్థ ఛైర్మన్ )
10) అగ్రికల్చర్, పునరుత్పాదక ఇంధనం, ఈ-వేస్ట్ మేనేజ్ మెంట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తు్న్న స్టార్టప్ లకు సాయం చేసేందుకు ఎన్ని డాలర్లతో గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, వెంచర్ క్యాపిటలిస్ట్ శైలేష్ విక్రమ్ సింగ్ ప్రకటించారు ?
జ: 150 మిలియన్ డాలర్లు
11) NRI వివాహాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి కేంద్రం కొత్త విధానం తీసుకొస్తోంది. అందుకోసం NRI లతో వివాహం అయిన ఎన్ని గంటల్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు ?
జ: 48 గంటలు
12) ప్రపంచ శాంతి సూచీ (పీస్ ఇండెక్స్) - 2018లో భారత్ స్థానం ఎంత ?
జ: 136 వ స్థానం
(నోట్: 2017- 137, 2016-141 స్థానాలు వచ్చాయి. ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వార్షిక నివేదికలో ఈ ర్యాంకులు ఇచ్చారు )

అంతర్జాతీయం
13) ప్రపంచ శాంతి సూచీ (పీస్ ఇండెక్స్) - 2018లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి ?
జ: ఐస్ లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా
14) ఈ ఏడాది చిన్నారుల పదంగా దేన్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది ?
జ: ప్లాస్టిక్

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు ....మీ సీరియస్ టార్గెట్ కి మా ప్లానింగ్ !
https://telanganaexams.com/new-planning/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
https://telanganaexams.com/mock-tests/