Saturday, February 23

CURRENT AFFAIRS – JUNE 6

రాష్ట్రీయం
01) తడి, పొడి చెత్త సేకరణకు రాష్ట్రంలో ఇప్పటికే రెండు డబ్బాల సిస్టమ్ నడుస్తోంది. ఇకపై ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏ డబ్బాలను ఇవ్వనున్నారు ?
జ: నల్ల డబ్బాలు
02) 2018 జులైలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక్కో బ్యాలెట్ లో ఎన్ని గుర్తులను ముద్రించనున్నారు ?
జ: 8 గుర్తులు
03) ఎండ్ ఆఫ్ టెర్రరిజం పేరుతో ఇరాన్ లో జరిగిన అంతర్జాతీయ కార్టూ్న్స్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకున్న హైదరాబాదీ కార్టూనిస్ట్ ఎవరు ?
జ: పామర్తి శంకర్ ( సాక్షి )
(నోట్: మయన్మార్ లో రొహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి శంకర్ గీసిన ఆంగ్ సాన్ సూకీ క్యారికేచర్ కు ఈ అవార్డు దక్కింది )

జాతీయం
04) ఉద్యోగాల్లో SC, STల పదోన్నతులకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ?
జ: 16(4ఏ)
05) 2022 కల్లా దేశంలో అందరికీ ఇళ్ళు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ గృహ పథకం పేరేంటి ?
జ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన
06) సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోని రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జులై నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం పేరేంటి ?
జ: కుసుమ్ పథకం
07) కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ఎవరు ?
జ: ఆర్కే సింగ్
08) 2017-18 బీసీసీఐ వార్షిక అవార్డుల్లో అండర్ - 16 ఉత్తమ క్రికెట్ గా ఎంపికైన ఏపీకి చెందిన క్రికెటర్ ఎవరు ?
జ: కె.నితీశ్ కుమార్ రెడ్డి
09) తమ కంపెనీ సర్వీసులన్నీ ఒకే బిల్లుకిందకు వచ్చేలాగా ఒక ఇల్లు - ఒకే బిల్లు పేరుతో ఎయిర్ టెల్ మొదటగా తమ సర్వీసులను ఎక్కడ ప్రారంభించింది ?
జ: హైదరాబాద్ లో
10) వాట్సాప్ ద్వారా తమ బ్యాంకుకు సంబంధించిన అన్ని సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్న బ్యాంకు ఏది ?
జ: కొటక్ మహేంద్ర బ్యాంక్
11) మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ ల్లో నీటి సంరక్షణ, తాగు నీరు ప్రాజెక్టులపై పనిచేసేందుకు టైర్లు, రబ్బర్ తయారు సంస్థ బ్రిడ్జ్ స్టోన్ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: యూనిసెఫ్ తో
12) అమెరికా వాషింగ్టన్ లోని ప్రతిష్టాత్మక న్యూస్ మ్యూజియంలో మన దేశానికి చెందిన ఇద్దరు పాత్రికేయుల వివరాలను చేర్చారు. వారి పేర్లేంటి ?
జ: గౌరి లంకేశ్, భౌమిక్
13) భారత దేశంలో అత్యంత పిన్నవయస్కుడైన రచయితగా (4 యేళ్ళు) ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన బుడతడు ఎవరు ?
జ: అయాన్ గొగొయ్ గోహ్లెన్ ( అసోంలోని లఖీంపూర్ కు చెందిన చిన్నారి)

అంతర్జాతీయం
14) ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా నియమితులైన మహిళ ఎవరు ?
జ: మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్బెస్
(నోట్: ఈక్వెడార్ విదేశాంగ మంత్రి. 70యేళ్ళ ఐరాస చరిత్రలో ఈ పదవి చేపట్టిన నాలుగో మహిళ )
15) 1953లో ఐరాస సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలి ఎంపికైన మొదటి మహిళ (భారతీయురాలు ) ఎవరు ?
జ: విజయలక్ష్మీ పండిట్ ( నెహ్రూ సోదరి)
16) అందాల పోటీల్లో 97 యేళ్ళుగా కొనసాగుతున్న స్విమ్ సూట్, బికినీ పోటీలను ఏ దేశంలో రద్దు చేశారు ?
జ: అమెరికాలో ( మిస్ అమెరికా పోటీల్లో ఇకపై ఈ రౌండ్ ఉండదు )