Monday, June 24

CURRENT AFFAIRS JUNE 5

తెలంగాణ
01) రైతు బంధు పథకం కింద 2.20 లక్షల మంది రైతులకు రూ.255 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఈ పథకం కింద ఎకరానికి ఎన్ని వేల చొప్పున చెల్లించారు ?
జ: రూ.5 వేలు
02) తెలంగాణ ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గతంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2014 ఏప్రిల్ మొదటి తేదీ నుంచి
03) పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ప్రకటించే ఈక్వేటరీ అవార్డు ఏ సంస్థకి దక్కింది ?
జ: దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ( DDS)
04) DDS సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది ?
జ: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర
05) టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.896.09 కోట్లు మంజూరు చేసింది. 200 ఎకరాల్లో ఐదేళ్ళల్లో పూర్తి స్థాయిలో సంస్థను నిర్మిస్తారు. TIFR ను ఎక్కడ నెలకొల్పుతున్నారు ?
జ: గోపనపల్లి

జాతీయం
06) వంటగ్యాస్ సబ్సిడీని ధనికులు వదులుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఇచ్చిన నినాదం ఏది ?
జ: గివ్ ఇట్ అప్
07) గివ్ ఇట్ అప్ స్ఫూర్తితో ఇప్పుడు పేద విద్యార్థులను చదివించేందుకు ఏ నినాదాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: ఈచ్ వన్.. టీచ్ వన్
08) ఈచ్ వన్ టీచ్ వన్ కింద ఎన్ని కోట్ల రూపాయలు సేకరించి, ఉన్నత విద్య చదివే 10 లక్షల మంది పేద విద్యార్థులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: రూ.25 వేల కోట్లు
09) మనుషుల్లో కుంగుబాటుకు కారణమయ్యే సెరటోనిన్ గ్రాహకాల సంచారానని కణాల్లో గుర్తించినట్టు ఏ శాస్త్రవేత్తలు ప్రకటించారు ?
జ: CCMB శాస్త్రవేత్తలు
10) 23 యేళ్ళ విద్యార్థికి ప్రాణాంతక నిఫా వైరస్ సోకింది. ఈ సంఘటన ఏ రాష్ట్రంలో బయటపడింది ?
జ: కేరళలో
11) భారత వాతావరణ విభాగం (IMD) చీఫ్ గా ప్రముఖ శాస్త్రవేత్త, సైక్లోన్ మ్యాన్ నియమితులయ్యారు. ఆయన పేరేంటి ?
జ: మృత్యుంజయ మహాపాత్ర
12) క్రికెట్ వరల్డ్ కప్ 2019 లో భారత్ మొదటి మ్యాచ్ ఏ జట్టుతో ఆడుతోంది ?
జ: దక్షిణాఫ్రికా
13) భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ క్రికెట్ కప్ 2019 మొదటి మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది ?
జ: సౌథాంప్టన్

అంతర్జాతీయం
14) కంటి శుక్లాలకు నిర్ధిష్టమైన చికిత్సను రూపొందించి ఎందరికో దృష్టి ప్రసాదించిన ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయారు. ఆమె పేరేంటి ?
జ: డాక్టర్ ఫ్యాట్రీసియా బాత్

 

Friends

మే నెలాఖారులో, జూన్ నాలుగవ తేదీ దాకా మిస్ అయిన కరెంట్ ఎఫైర్స్ ను రెండు, 3 రోజుల్లో ఇచ్చేస్తాను.  pl cooperate