Sunday, June 24
Log In

CURRENT AFFAIRS – JUNE 4

రాష్ట్రీయం
01) మలేసియాకి చెందిన DXN కంపెనీ ద్వారా రూ.175 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లిలో
03) రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే రైతలు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్ని లక్షల భూ ఖాతాలు ఉన్నాయి ?
జ: 72 లక్షలు

జాతీయం
04) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం దీర్ఘశ్రేణి క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ?
జ: అగ్ని-5
05) బంగాళా ఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి అగ్ని-5 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దీని లక్ష్యం ఎన్ని కిలోమీటర్లు ?
జ: 5 వేల కిలోమీటర్లు
06) అగ్ని క్షిపణి ప్రయోగం మొదట ఎప్పుడు జరిగింది ?
జ: 2012 ఏప్రిల్ 19న
07) అగ్ని క్షిపణులు - అవి ప్రయాణించే కిలోమీటర్లు
జ: అగ్ని - 1 - 700 కిమీ
అగ్ని - 2 - 2వేల కిమీ
అగ్ని -3 - 2500-3500 కిమీ
అగ్ని5 - 5 వేల కిమీ
08) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఇబ్బందిగా మారిన నిరర్ధక ఆస్తులు (NPA), ఇతర బ్యాంకు కుంభకోణాలపై ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమీక్షించింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జ: వీరప్ప మొయిలీ
09) కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు ?
జ: ఆల్ఫోన్స్ కన్నన్ థానమ్
09) జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళిగా ఎక్కడ భారీ రాట్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ?
జ: సబర్మతీ ఆశ్రమం (గుజరాత్ లోని అహ్మదాబాద్ లో )
10) గవర్నర్ల ప్రయాణ భత్యాలు, ఆతిథ్య ఖర్చులు తదితరాలపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. దీని ప్రకారం దేశంలో ఏ గవర్నర్ కి అత్యధికంగా రూ.1.81 కోట్ల అలవెన్సులు అందుతున్నాయి ?
జ: పశ్చిమ బెంగాల్ గవర్నర్
11) ప్రస్తుతం గవర్నర్ల నెలసరి జీతం ఎంత ?
జ: రూ.3.5 లక్షలు
12) సైనిక దళాలకు అధునాతన కామోవ్ -226 T సైనిక హెలికాప్టర్లను 200 వరకూ ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: రష్యా
13) రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కార్యదర్శి, CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: విజయ్ మహాజన్

అంతర్జాతీయం
14) 168 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ముగ్గురు వ్యోమగాములు ఎక్కడ సురక్షితంగా దిగారు ?
జ: కజికిస్థాన్ లో
15) ISS లో 168 రోజులు గడిపి భూమికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములు ఎవరు ?
జ: ఆంటోన్ షెక ప్లెరోవ్ (రష్యా)
స్కాట్ టింగల్ (అమెరికా)
నోరిషిగి కనాయ్ (జపాన్ )

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *