Friday, February 22

CURRENT AFFAIRS -JUNE 30

రాష్ట్రీయం
1) ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు, భూరికార్డుల నిర్వహణకు వాడుతున్న బ్లాక్ చైన్ పరిజ్ఞానంపై హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు ఎప్పుడు జరగనుంది ?
జ: ఆగస్టు మొదటివారంలో
2) తెలంగాణలో వాతావరణం గురించి తెలుసుకునేందుకు మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేసిన యాప్ పేరేంటి ?
జ: టీఎస్ వెదర్ యాప్
(నోట్: ఈ యాప్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పనిచేస్తుంది )
3) భారత్ లో దొరుకుతున్న ఆహారం, అందులో ఉండే పోషక విలువలకు సంబంధించిన (ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్) వివరాలతో జాతీయ పోషకాహార సంస్థ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరేంటి?
జ: న్యూటిఫై ఇండియా నౌ
4) దుబాయ్ లో ఆర్థికాంశాల అధ్యయన సంస్థ నుంచి అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ అవార్డు అందుకున్నది ఎవరు ?
జ: సింగరేణి సీఎండీ శ్రీధర్
5) నీతి ఆయోగ్ చేపట్టిన 108 ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో జాబితాలో స్థానం దక్కించుకున్న తెలంగాణ జిల్లాలు ఏవి ?
జ: 11వ స్థానం ఖమ్మం, 15వ స్థానం ఆసిఫాబాద్
6) ఇండోనేషియాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల బాక్సింగ్ జట్టులో చోటు దక్కించుకున్న తెలంగాణ బాక్సర్ ఎవరు ?
జ: హుసాముద్దీన్
7) WE HUB ని విస్తరించండి?
జ: Women Entrepreneurs Hub

జాతీయం
8) జాతీయ నమూనా సర్వే సంస్థ నిర్మాత పేరున రూ.125 నాణేన్ని కోల్ కతాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయన పరేంటి ?
జ: మహల్ నోబిస్
9) దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నీతి ఆయోగ ప్రారంభించిన కార్యక్రమం ఏది ?
జ: ఆకాంక్షిత జిల్లాలు
10) 108 ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో ఏయే రంగాల్లో నీతి ఆయోగ అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది ?
జ: ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం-జలవనరులు, ఆర్థిక సమ్మిళితం-నైపుణ్యాభివృద్ధి-మౌలిక వసతులు
11) ఆకాంక్షిత జిల్లాల ర్యాంకుల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి ?
జ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
12) ఆకాంక్షిత జిల్లాల జాబితాలో జిల్లాల వారీగా మొదటి ర్యాంకు దేనికి వచ్చింది ?
జ: దహోద్ (గుజరాత్)
13) తప్పిపోయిన చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేర్చేందుకు ఉపయోగపడే ఏ యాప్ ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీలో ప్రారంభించారు ?
జ: రీ యునైట్
14) 2018-19, 2019-20ల్లో భారత ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని IMF తెలిపింది ?
జ: 7.4 శాతం, 7.8శాతం
15) ICICI బ్యాంక్ కొత్త నాన్ -ఎగ్జిక్యూటివ్ తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేది

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/