Sunday, June 24
Log In

CURRENT AFFAIRS – JUNE 3

రాష్ట్రీయం
01) మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఎంతకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: రూ.205
(నోట్: ఇది గతంలో 197 రూపాయలుగా ఉండేది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి వస్తుంది )
02) తాజాగా రాష్ట్రంలో ఏ పథకానికి స్కోచ్ అవార్డు లభించినట్టు ఆ గ్రూప్ ఎడిటర్, CEO డాక్టర్ గుర్షరన్ ధంజల్ ప్రకటించారు ?
జ: రైతు బంధు పథకం
03) భారీ పరిశ్రమల కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అవార్డు అందుకున్న సంస్థ ఏది ?
జ: ఆయిల్ ఫెడ్

జాతీయం
04) అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు GST, IGST భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ?
జ: సేవా భోజ్ యోజన
05) ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి భవన్ లో సమావేశం ఎప్పుడు జరిగింది ?
జ: 2018 జూన్ 4, 5 తేదీల్లో
06) ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష జరిపిన రెండో రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ రికార్డు సృష్టిస్తున్నారు. గతంలో ఎవరి హయాంలో ఇలాంటి సమీక్షా సమావేశం జరిగింది ?
జ: 1949లో గవర్నర్ జనరల్ సి.రాజగోపాలా చారి

అంతర్జాతీయం
07) బ్రిటన్ లో భారతీయు వైద్యులు చేపట్టిన స్క్రాప్ ద క్యాప్ ప్రచారం దేనికి సంబంధించినది ?
జ: కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలని
08) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ ఈనెల 12న ఎక్కడ సమావేశం అవుతున్నారు ?
జ: సింగపూర్ లో
09) స్పెయిన్ కొత్త ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: పెడ్రో సాంచెజ్ ( సోషలిస్ట్ పార్టీ నేత )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *