Sunday, March 24

CURRENT AFFAIRS – JUNE 2

రాష్ట్రీయం
01) ఐటీ ఉత్పత్తుల్లో 2017-18 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ?
జ: 9.32 శాతం వృద్ధి
(నోట్: జాతీయ సగటు వృద్ధి రేటు 7.9శాతం కంటే ఎక్కువ )
02) 2017-18 సంవత్సరంలో ఐటీ రంగంలో ఎగుమతుల విలువ ఎంత ?
జ: 93,442 కోట్లు
03) రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకాలు అందుకున్నది ఎవరు ?
జ: ఎస్.రవీందర్ ( ఇన్సెపెక్టర్ ), జి.వెంకటేశ్ ( ఇన్సెపెక్టర్ ), పి.రాములు (కానిస్టేబుల్ )
04) ఉత్తమ పశు ఆరోగ్య సేవలు, పశు జాతి అభివృద్ధి కార్యక్రమాలు, పశు గణ అభివృద్ధి సేవలకు రాష్ట్ర పశు సంవర్థక శాఖకు కేంద్ర అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి ఎవరు?
జ: కృష్ణ రాజ్
05) దేశీ ఆవులు, గేదెల అభివృద్ధి, పరిరక్షణకు జాతీయ గోపాల రత్న అవార్డు రాష్ట్రంలోని ఏ సంస్థకు దక్కింది ?
జ: కిలిమామ్ గోశాల
(నోట్: గోశాల నిర్వాహకురాలు దివ్యారెడ్డి )
06) సైబర్ భద్రతను పటిష్టం చేసేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెంటర్ ను ఏర్పాటు చేసింది ?
జ: సైబర్ సెక్యూరిటీ - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( CEO)
07) ఐటీ రంగంలో ఉత్తమ పనితీరు కనబరచిన పెద్ద కంపెనీల విభాగంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కారం ఏ సంస్థకి లభించింది ?
జ: ఇన్ఫోసిస్
(నోట్: ఇన్ఫోసిస్ రూ.10,889 కోట్ల ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచింది )
08) రాష్ట్రంలోని అపాచి హెలికాప్టర్ల విడిభాగం పరిశ్రమ టాటా బోయింగ్ లో తయారైన విడి భాగాలు అమెరికాకి ఎగుమతి అయ్యాయి. ఈ పరిశ్రమ ఎక్కడ ఉంది ?
జ: ఆదిభట్ల
09) ఉచితంగా 52 వైద్య పరీక్షలు నిర్వహించే తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకాన్ని ( టీ డయాగ్నోస్టిక్స్ ) ఎప్పుడు అధికారికంగా ప్రారంభించనున్నారు ?
జ: జూన్ 8న

జాతీయం
10) సింగపూర్ లో ఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఉపన్యాసం చేశారు ?
జ: షాంగ్రి -లా డైలాగ్
(నోట్: ఇది 28వ ఆసియా - పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక )
11) భారత్ - సింగపూర్ మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎన్ని ఒప్పందాలు కుదిరాయి
జ: 8 ఒప్పందాలు
12) ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సింగపూర్ ప్రధాని ఎవరు ?
జ: లూంగ్
13) సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ కు చెందిన మాజీ రాయబారికి పద్మశ్రీ పురస్కారం అందించారు. ఆయన పేరేంటి ?
జ: టామీ కోహ్
14) బ్లాక్ మనీ హోల్డర్స్ పనిపట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త ఆఫర్ ప్రకటించింది. పన్నుల ఎగవేతదారుల వివరాలు ఇస్తే ఎంత రివార్డు ఇవ్వాలని నిర్ణయించింది ?
జ: రూ.50 లక్షల రివార్డు
15) జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: కౌట్రక్ ( మణిపూర్ లోని ఇంఫాల్ జిల్లాలో )
16) జాతీయ పాలదినోత్సవం ఎప్పుడు నిర్వహించారు ?
జ: జూన్ 1
17) కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య ఏ నదీ జలాల వివాద పరిష్కారానికి యాజమాన్య సంస్థ ఏర్పాటు చేస్తూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది ?
జ: కావేరీ నది
18) బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ఏ వ్యాపారవేత్తను స్టాక్ మార్కెట్ల నుంచి మరో 3 యేళ్ళ పాటు నిషేధిస్తున్నట్టు సెబీ ప్రకటించింది ?
జ: విజయ్ మాల్యా

అంతర్జాతీయం
19) అమెరికాలో ఏటా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో గెలుపొందిన భారత సంతతికి బాలుడు ఎవరు ?
జ: కార్తీక్ నెమ్మాని
(నోట్: koinonia అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి విజేత అయ్యాడు )
20) పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు ?
జ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నసీరుల్ ముల్క్
21) భారత్ సహా 39 దేశల్లో ఏ ఇంజెక్షన్ కొరత ఉందని యాక్సెస్ అటు మెడిసిన్ ఫౌండేషన్ ప్రకటించింది ?
జ: పెన్సిలిన్

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు
మీ సీరియస్ టార్గెట్ కి మా ప్లానింగ్ !
https://telanganaexams.com/new-planning/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
https://telanganaexams.com/mock-tests/