Monday, October 21

CURRENT AFFAIRS – JUNE 19

తెలంగాణ
01) రాష్ట్ర కొత్త అసెంబ్లీని రూ.500 కోట్లతో ఎక్కడ నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ?
జ: ఎర్రమంజిల్ లో
02) రాష్ట్ర కొత్త సచివాలయంను ఎక్కడ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ప్రస్తుతం ఉన్న స్థలంలోనే
03) డిగ్రీ కోర్సులోని పలు విభాగాలకు ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉస్మానియా వర్సిటీలోని EMRC (ఎడ్యుకేషన్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ )తో ఏ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఒప్పందం
04) అంతర్జాతీయ విత్తన సదస్సు 2019 జూన్ 29 నుంచి జులై 3 వరకూ ఎక్కడ జరగనుంది ?
జ: హైదరాబాద్ హైటెక్స్

జాతీయం
05) 17వ లోక్ సభ స్పీకర్ గా ఎవరిని బీజేపీ ప్రతిపాదించింది ?
జ: ఓం బిర్లా
06) ఓం బిర్లా ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు ?
జ: రాజస్థాన్ లోని కోటా - బూంది నియోజకవర్గం
07) వార్షికాదాయం ఎంత లోపు ఉన్న పేదవారికి పట్టణాల్లో అద్దె ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది ?
జ: రూ.3 లక్షల లోపు ఆదాయం
08) లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతలగా ఎవరికి ఆ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది ?
జ: అధీర్ రంజన్ చౌధరీ ( బెంగాల్ లోని బెర్హంపోర్ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు )
09) డ్రైవింగ్ లైసెన్స్ కు కనీస విద్యార్హతలను తొలగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శఆఖ నిర్ణయించింది. గతంలో డ్రైవింగ్ లైసెన్సుకు ఏ విద్యార్హత ఉండేది ?
జ: 8వ తరగతి
10) దేశంలోనే మొదటిసారిగా 6 వేల హార్స్ పవర్ (6000HP) సామర్థ్యంతో కూడిన WDG-6G లోకోమోటివ్ ని ఏ ఏరియాలో ట్రయల్ రన్ నిర్వహించాలని రైల్వే శాఖ నిర్ణయించింది ?
జ: వికారాబాద్ - పర్లి మార్గంలో
11) WDG-6G లోకోమోటివ్ రైలును ఎక్కడ తయారు చేశారు ?
జ: అమెరికా పెన్సిల్వేనియాలోని జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ
12) 2019 అక్టోబర్ 2న ODF ఇండియా ( నూరుశాతం బహిరంగ మల విసర్జన రహిత) దేశంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడ జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రకటన చేస్తారు ?
జ: అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో
(నోట్: వచ్చే అక్టోబర్ 2నాడు గాంధీజీ 150జయంతిని నిర్వహిస్తున్నారు )
13) ఇటీవల వార్తల్లోకి వచ్చిన లాయర్స్ కలెక్టివ్ అనేది దేనికి సంబంధించింది ?
జ: స్వచ్ఛంద సంస్థ
(నోట్: విదేశీ విరాళాల వ్యవహారాంలో రూల్స్ అతిక్రమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ఇది )
14) వాతావరణ మార్పులతో భారత్ లో ఆహారం కొరత ఏర్పడతుందనీ, తృణ ధాన్యాలు సాగును విస్తృతం చేయాలని సలహా ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు ?
జ: అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు

అంతర్జాతీయం
15) వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో 17 సిక్సర్లు బాదిన క్రికెటర్ ఎవరు ?
జ: ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
16) ఇంగ్లాండ్ లో ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో మోర్గాన్ 17 సిక్సర్లు కొట్టాడు ?
జ: ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో
17) నగదు దాచుకోవడం, ఇతరులకు పంపడం లాంటివి ఈజీగా నిర్వహించుకునేందుకు ఫేస్ బుక్ సంస్థ అంతర్జాతీయ కరెన్సీని ఆవిష్కరించింది (క్రిప్టో కరెన్సీ తరహాలో). దాని పేరేంటి ?
జ: లిబ్రా
18) అంతర్జాతీయ యుగంలోకి కొత్తగా అడుగుపెట్టిన రెండు దేశాలు ఏవి ?
జ: శ్రీలంక, నేపాల్
19) శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన ఏయే ఉప గ్రహాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని జపాన్ కు చెందిన కిటో మాడ్యూల్ ద్వారా కక్ష్యలోకి చేరాయి ?
జ: శ్రీలంక ఉపగ్రహం - రావణ-1
నేపాల్ ఉపగ్రహం: నేపాలీ శాట్ 1

please subscribe our Telangana Exams You Tube channel with the following Link.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true