Monday, October 21

CURRENT AFFAIRS JUNE 16, 17

తెలంగాణ
01) 2019 జూన్ 17 నుంచి రాష్ట్రంలో కొత్తగా ఎన్ని బీసీ గురుకులాలు ప్రారంభం అయ్యాయి ?
జ: 119 పాఠశాలలు (ఈ ఏడాది 5,6,7 తరగతులు ప్రారంభం)
02) రాష్ట్రంలో సౌర విద్యుత్ కు సంబంధించిన అంశాలను పరిశీలించే సంస్థ ఏది ?
జ: తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరు అభివృద్ధి సంస్థ ( TS REDCO)
03) రూపాయికే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న మున్సిపాలిటీ ఏది ?
జ: కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్
04) ఏ షెడ్యూలు కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తొందరగా విభజించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించాయి ?
జ: 9, 10 షెడ్యూల్ సంస్థలు
05) 9, 10 షెడ్యూల్స్ కింద ఎన్ని సంస్థలు ఇంకా విభజన కాకుండా ఉన్నాయి ?
జ: 9వ షెడ్యూల్ - 89, 10వ షెడ్యూల్ - 107

జాతీయం
06) నీతి ఆయోగ్ ఐదో సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: న్యూ ఢిల్లీలో
07) 2019 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.75 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 కల్లా దీన్ని ఎన్ని ట్రిలియన్ డాలర్ల స్థాయికి తేవాలని కేంద్రం భావిస్తోంది ?
జ: 5 ట్రిలియన్ డాలర్ల స్థాయి
08) దక్షిణ భారత దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి సెమీ హైస్పీడ్ కారిడార్ ను ఏర్పాటు చేయొచ్చని రష్యన్ రైల్వేస్ సంస్థ రైల్వేశాఖకు నివేదిక సమర్పించింది ?
జ: సికింద్రాబాద్ టు నాగ్ పూర్
09) సికింద్రాబాద్ టు నాగ్ పూర్ సెమీ హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేస్తే రైళ్ళు గంటకు ఎన్ని కిలోమీటర్ల సామర్థ్యంతో వెళతాయి ?
జ: 180 కిమీ.
10) ఈ కారిడార్ ఏర్పాటైతే 584 కిమీ దూరం ఎన్ని గంటల్లో చేరే అవకాశముంది ?
జ: 4 గంటలు (ఇప్పుడు 9 గంటలు పడుతోంది )
11) భారత్, మయన్మార్ కు చెందిన దేశాలు తమ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాద ముఠాలపై చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ?
జ: ఆపరేషన్ సన్ రైజ్ - 2
12) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB)లకు మూల ధన అవసరాల కోసం ఎంత మొత్తం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది ?
జ: రూ.30 వేల కోట్లు
13) దేశంలో కుటుంబ వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయని ఫ్యామిలీ బిజినెస్ సర్వే 2019 తేల్చి చెప్పంది. PWC సంస్థ ఈ సర్వే రూపొందించింది. వచ్చే రెండేళ్ళల్లో ఎంత శాత వృద్ధి చెందే అవకాశముందని సర్వే వెల్లడించింది ?
జ: 89శాతం వృద్ధి
14) ముంబైలో జరుగుతున్న అందాల పోటీల్లో మిస్ ఇండియా 2019 గా నిలిచిన సీఏ విద్యార్థిని ఎవరు ?
జ: సుమన్ రావ్ (రాజస్థాన్)
(నోట్: 2019 డిసెంబర్ లో బ్యాంకాక్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో దేశం తరపున పాల్గొంటారు )
15) అందాల పోటీల్లో సెకండ్ రన్నరప్ (విజ్ మిస్ ఇండియా)గా నిలిచిన తెలంగాణ అమ్మాయి ఎవరు ?
జ: సంజన

అంతర్జాతీయం
16) ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినందుకు ఏ దేశానికి చెందిన ప్రధాని భార్యకు ఆ దేశ న్యాయస్థానం రూ.10 లక్షలు ( 15000 డాలర్ల) జరిమానా విధించింది ?
జ: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భార్య సారా
17) పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI ) కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఫైజ్ హమీద్
18) మేధో సామర్థ్యం (IQ) ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక బ్రిటీష్ మెన్సా సభ్యత్వ క్లబ్బులో చేరేందుకు ఆహ్వానం పొందిన బ్రిటన్ లోని భారత సంతతి బాలిక ఎవరు ?
జ: జియా వదుచా
19) విద్యుత్ వ్యవస్థలో లోపాలు తలెత్తడంతో దక్షిణ ఏ అమెరికా దేశాల్లో ఆదివారం ఉదయం చీకటి మయం అయ్యాయి ?
జ: అర్జెంటీనా, ఉరుగ్వే
20) 63 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతతో ప్రపంచలోనే హయ్యస్ట్ టెంపరేచర్ 2019 జూన్ 8న ఎక్కడ నమోదైంది ?
జ: కువైట్ సిటీ

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ