Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS JUNE 14

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ?
జ: బయ్యారం ఉక్కు పరిశ్రమ
02) యాసిడ్ దాడి బాధితులను కూడా దివ్యాంగుల్లో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేటగిరీలో మొత్తం ఎన్ని రకాల వైకల్యాలను ప్రభుత్వం చేర్చింది ?
జ: 21 రకాల వైకల్యాలు
03) దివ్యాంగుల్లో కేటగిరీల సంఖ్య పెరగడంతో రిజర్వేషన్లను ఎంతవరకూ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 4 శాతం
04) ఏ కేటగిరీకి చెందిన మహిళల మూడో బిడ్డకు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గిరిజన మహిళలు
05) ఈ-PDS విధానం విజయవంతం చేసినందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖకి ఏ అవార్డు దక్కింది ?
జ: జెమ్స్ ఆప్ డిజిటల్ ఇండియా అవార్డు 2018
06) దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వం వైద్య రంగంలో నేత్రనిధి ( ఐ బ్యాంక్ ) ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి ( హైదరాబాద్ )
07) రాష్ట్రంలో సింగరేణికి చెందిన ఏ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పర్యావరణ హిత పద్దతుల్లో నిర్వహిస్తున్నారు ?
జ: జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ( మంచిర్యాల )

జాతీయం
08) దేశంలో 5 కోట్లమంది మహిళలకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో కేంద్రం కొత్తగా తెచ్చిన సౌర చరఖా పథకాన్ని 2018 జూన్ 27న ఎవరు ప్రారంభిస్తున్నారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
09) ఆరు AH 64 అపాచె హెలికాప్టర్లను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేయనుంది ?
జ:అమెరికా
10) 2018 జూన్ 16 నుంచి కార్ల్ మార్క్స్ పై 5 రోజులు అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: పట్నా (బిహార్)
11)ప్రతిష్టాత్మక జపాన్ పురస్కారమైన నిక్కీ ఏసియా ప్రైజ్ ఏ భారతీయుడికి దక్కింది ?
జ: సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్
12) గో సంరక్షణ మండలి అధ్యక్షుడికి ఏ రాష్ట్రంలో మంత్రి హోదా కల్పించారు ?
జ: మధ్యప్రదేశ్ లో
13) నదుల అనుసంధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఏయే నదులపై తొలి దశ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సర్కార్ అనుమతించింది ?
జ: గోదావరి, పెన్నా
14) రిజర్వేషన్ అవసరం లేని (సాధారణ, అన్ రిజర్వుడ్ ) టిక్కెట్ల జారీకి రైల్వేశాఖ తీసుకొచ్చిన ప్రత్యేక మొబైల్ యాప్ ఏది ?
జ: UTS ON MOBILE
15) టెస్టుల్లో అరంగేట్ర టెస్టును అఫ్గనిస్తాన్ ఏ దేశ జట్టు ఆడుతోంది ?
జ: భారత్ ( బెంగళూరులో మొదటి టెస్ట్ మ్యాచ్ )

అంతర్జాతీయం
16) 32 రోజుల పాటు జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ సంబరాలు ఎక్కడ మొదలయ్యాయి ?
జ: రష్యా లోని లుజ్నికి స్టేడియంలో
17) ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ ఏయే దేశాల మధ్య జరిగింది ?
జ: రష్యా వర్సెస్ సౌదీ అరేబియా
18) 2026 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఏయే దేశాల్లో నిర్వహించనున్నారు ?
జ: అమెరికా, మెక్సికో, కెనడా

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్)
https://telanganaexams.com/books/

SI/PC/VRO/GR.I,II & IV 200 మాక్ టెస్టులు
https://telanganaexams.com/mock-tests/