Thursday, February 27

CURRENT AFFAIRS JUNE 13 & 14

తెలంగాణ
01) కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా ఏ పంపు హౌస్ దగ్గర ఈనెల 21న సీఎం కేసీఆర్ మోటార్లను స్విచాన్ చేయనున్నారు ?
జ: మేడి గడ్డ పంపు హౌస్
02) రెవెన్యూ సమస్యలకు క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపేందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: భూ వాణి
03) రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానంలో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం బాగుతందని కితాబిచ్చిన ఐక్యరాజ్య సమితి వ్యవసాయ సంస్థ ప్రతినిధి ఎవరు ?
జ: టోనీ సంగనిరా
04) రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ అమలు చేస్తున్న విధానాలను అధ్యయం చేసేందుకు ఏ దేశానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల బృందం హైదరాబాద్ కి వచ్చింది?
జ: బంగ్లాదేశ్ బృందం
05) ఐక్యరాజ్య సమితి పరిధిలో రైతుల జీవనోపాధి మెరుగు పరిచేందుకు పనిచేస్తున్న ప్రత్యేక సంస్థ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ కన్సల్టెంటుగా నియమితులైన హైదరాబాద్ శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ షేక్ ఎన్ మీరా
(నోట్: ఈయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ రైస్ రీసెర్చ్ లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు )
06) వనజీవి రామయ్య స్ఫూర్తిని ఏ తరగతిలో పాఠ్యాంశంగా చేర్చారు ?
జ: ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో
07) రాష్ట్రంలో ఏ టెంపుల్ సిటీని స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: యాదాద్రి

జాతీయం
08) పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎక్కడ జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ దగ్గర ప్రస్తావించారు ?
జ: బిష్కెట్ (కిర్కిజిగిస్తాన్ )
09) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఫించన్ పథకం కింద ఫించన్ నిధికి రైతులు నెలకు ఎంతమొత్తం చెల్లించాలని కేంద్ర నిర్దేశించింది ?
జ: రూ.100 మాత్రమే
10) ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగులు చెల్లిస్తున్న ESIC చందా మొత్తాన్ని ఎంతకు తగ్గిస్తూ కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది ?
జ: 6.5శాతం నుంచి 4 శాతానికి
11) చంద్రయాదన్ 2 కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది ?
జ: 2019 జులై 15న
12) ఎన్ని టన్నుల బరువుతో అంతరిక్షంలో సొంతంగా కేంద్ర నిర్మించాలని ఇస్రో నిర్ణయించింది ?
జ: 20 టన్నులు
13) ఫోర్బ్స్ జాబితా విడుదల చేసిన ప్రపంచంలోని 2000 అతి పెద్ద సంస్థల జాబితాలో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయి ?
జ: 57 కంపెనీలు
14) అంతర్జాతీయంగా అగ్రగామి 10 వినియోగదారు ఆర్థిక సంస్థల్లో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన బ్యాంకు ఏది?
జ: HDFC
15) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉంచుకోవాల్సిన మూలధన పరిమాణం అంశాన్ని ఏ కమిటీ పరిశీలిస్తోంది ?
జ: బిమల్ జలాన్ కమిటీ
16) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎంత శాతం మంది మన దేశంలో ఉన్నారు ?
జ: 12శాతం మంది
17) భారత నౌకాదళానికి 1,187.82 కోట్ల విలువైన అధిక బరువున్న టోర్పెడోలు సరఫరా చేసే భారీ ఆర్డర్ ఏ సంస్థకు దక్కింది ?
జ: భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL- హైదరాబాద్ )
(నోట్: 42 నెటల్లో వీటిని సరఫరా చేయనుంది )
18) మండుటెండల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎయిర్ కండీషన్డ్ హెల్మెట్స్ అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఛత్తీస్ గఢ్
19) బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బిహార్ కు చెందిన ఎంతమంది రైతుల బ్యాంకు రుణాలను చెల్లించారు ?
జ: 2,100 మంది

అంతర్జాతీయం
20) ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎన్నికోట్లకు చేరినట్టు మేరీ మీకర్ 2019 నివేదిక తెలిపింది ?
జ: 380 కోట్లు

please watch video & subscribe our Telangana Exams You Tube channel with the following Link.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్ ( మొదటి వీడియో ) : 

 

జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్ ( రెండో వీడియో ) :