Sunday, December 16

CURRENT AFFAIRS – JUNE 12

రాష్ట్రీయం
1) జాబ్ పోర్టల్ ఇండీడ్ నివేదిక ప్రకారం టెక్ ఉద్యోగాల్లో దేశంలో హైదరాబాద్ స్థానం ఎంత ?
జ: నాలుగు
(నోట్: మొదటి స్థానం బెంగళూరు, రెండు ఢిల్లీ-SCR, మూడు పుణె )
2) తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పి.భూపతి రెడ్డి
3) రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్ ఎవరు ?
జ: కేతిరుడ్డి వాసుదేవ రెడ్డి
4) హైదరాబాద్ నెపర్ ( నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ) డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: శశి బాలా సింగ్
5) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికైన సింగరేణి సీఎండీ ఎవరు ?
జ: శ్రీధర్
6) జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న రాష్ట్ర పొదుపు సంఘాలు ఏవి ?
జ: 1) వరంగల్ ముదిరాజ్ మహిళా స్వయం సహాయక సంఘం 2) కామారెడ్డి శ్రీలక్ష్మీ స్వయం సహాయక సంఘం

జాతీయం
7) స్థూల ఆర్థిక గణాంకాలకు ఆధార సంవత్సరాన్ని ఏ ఏడాదిగా మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 2017-18
8) ప్రస్తుతం స్థూల ఆర్థిక గణాంకాలకు ఆధార సంవత్సరం ఏది ?
జ: 2011-12
9) రూపాయి బలోపేతానికి NRI బాండ్లు ప్రవేశపెట్టాలని RBI నిర్ణయించింది. ఎన్ని డాలర్లను సేకరించాలని భావిస్తున్నారు ?
జ: 30-35 బిలియన్ డాలర్లు ( రూ.2 -2.25 లక్షల కోట్లు )
10) బ్లడ్ బ్యాంకులను (రక్త నిధి) లను ఏవిధంగా పేరు మార్చాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: రక్త కేంద్రాలు ( బ్లడ్ సెంటర్స్ )

అంతర్జాతీయం
11) అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అద్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న సింగపూర్ లో సమావేశమైన హోటల్ పేరేంటి ?
జ: కేపెల్లా