Sunday, June 24
Log In

CURRENT AFFAIRS – JUNE 10

రాష్ట్రీయం
1) తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (నారాయణగూడ )
2) రాష్ట్రంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయనున్నారు ?
జ: 10 వేల మందికి
3) ఈ ఏడాది హరితహారంలో ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది ?
జ: 38.27 కోట్లు
4) తెలంగాణకు హరితహారం మొదటి కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: చిల్కూరు ( మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా)
5) నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు ఏ సంస్థతో కలసి ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయోగాలు చేస్తోంది ?
జ: ఇక్రిశాట్ తో

జాతీయం
6) భారీ ఉల్క ఢీ కొనడం వల్లే రామ్ గఢ్ మహా బిలం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బిలం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో
7) అమెరికాలో జరిగిన యూనివర్సిటీ గేమ్స్ ... నేషల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో హైజంప్ లో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ ఎవరు ?
జ: తేజస్విన్
8) పరోక్ష, కస్టమ్స్ పన్నుల కేంద్ర బోర్డు ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ) కొత్త ఛైర్మన్ ఎవరు ?
జ: ఎస్. రమేష్
9) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్టింగ్ ఛైర్మన్ ఎవరు ?
జ: అరవింద్ సక్సేనా
10) దేశంలోనే మొదటి పోలీస్ మ్యూజియం ను ఏ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ఢిల్లీ
11) శరద్ కుమార్ ను కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమించారు. cvc ని ఏ కమిటీ సిఫార్సులతో ఏర్పాటు చేశారు ?
జ: కె. సంతానం కమిటీ

అంతర్జాతీయం
12) ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ను అమెరికా ఆవిష్కరించింది. దాని పేరేంటి ?
జ: సమిట్
13) ఇప్పటిదాకా అత్యంత శక్తివంతమైన చైనా తయారీ సూపర్ కంప్యూటర్ ఏది ?
జ: సన్ వే తైహులైట్ ( సెకనకు 93 వేల ట్రిలియన్లు లెక్కిస్తుంది)
14) ఫిఫా ప్రపంచ కప్ పోటీలు ఏ దేశంలో జరుగుతాయి ?
జ: రష్యాలో
15) 45 వ జీ-7 సదస్సు 2019 ఏ దేశంలో నిర్వహించారు ?
జ: కెనడా
16) 2018 ఆసియా కప్ ట్వంటీ 20 టోర్నమెంట్ ను గెలుచుకున్న జట్టు ఏది
జ: బంగ్లాదేశ్
17) 2018 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ?
జ: రాఫెల్ నాదల్
18) 2018 ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్ బాల్ టైటిల్ ను గెలుచుకున్న జట్టు ఏ దేశానికి చెందినది ?
జ: భారత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *