Friday, November 15

CURRENT AFFAIRS – JUNE 10, 11

తెలంగాణ
01) రాష్ట్రంలో ONGC చేపట్టిన సర్వేలో ఏయే జిల్లాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు తేలింది ?
జ: కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల్లో
(నోట్: కాగజ్ నగర్, సిర్పూర్ (టీ), దహెగాం, పెంచికల్ పేట మండలాల్లో )
02) 2018-19లో ఉపాధి హామీ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లతో అమలు చేసింది ?
జ: రూ.3 వేల కోట్లతో అమలు
03) రాష్ట్రంలో కిందటేడాది రూ.947.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5.70 కోట్ల పనిదినాలను ఎంతమందికి కల్పించారు ?
జ: 31.20 లక్షల మందికి
04) బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆపద్భందు పథకాన్ని ఎప్పటిదాకా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది ?
జ: 2019 నవంబర్ 1 వరకూ
05) ఆపద్బందు పథకం కింద 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తూ చనిపోయిన వారికి ఎంత మొత్తం ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది ?
జ: రూ.50 వేలు
06) ఇంటర్నేషనల్ బయో ప్రోసెసింగ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫఓరం అండ్ ఇండస్ట్రియల్ బయో ప్రోసెసింగ్ సంస్థ 2017-18 సంవత్సరానికి అత్యుత్తమ శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ ఎస్. వెంకట మోహన్
(నోట్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త )
07) ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన పుస్తకాలు ఏవి ?
జ: ఎందరొచ్చినా, తెలంగాణ విజయగాథ, సమ్మోహనాస్త్రం
08) గ్రామాయణం పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: మారం రాజు సత్యనారాయణ
09) కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర్లో మహరాష్ట్ర వైపు కట్ట, కరకట్ట నిర్మాణాల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎంత అటవీ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ?
జ: 10 హెక్టార్ల భూమి
10) రాష్ట్రంలో బోనాల సందడి ఎప్పటి నుంచి మొదలవుతోంది ?
జ: 2019 జులై 4 నుంచి
11) రాష్ట్రంలో మొదట బోనాల పండగ ఎక్కడి నుంచి మొదలవుతుంది ?
జ: గోల్కొండ బోనాలు

జాతీయం
12) దేశ రాజధాని ఢిల్లీకి ఐదు వలయాలతో రక్షణ కల్పించేందుకు నేషనల్ అడ్వాన్డ్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ 2 ( నాసామ్స్-2) ని ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: అమెరికా (రు.6వేల కోట్లు )
13) సుఖోయ్ 30 MKE యుద్ధ విమానాలకు ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అనుసంధానించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది ?
జ: బ్రహ్మోస్
14) సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని మొదటగా ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించారు ?
జ: 2017 నవంబర్ 22న
15) చంద్రయాన్ - 2 ను ఎప్పుడు ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది ?
జ: 2019 జులై 9
16) నగదు లావాదేవీలను తగ్గించేందుకు ఏడాదిలో ఎంత మొత్తం కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే 5శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: రూ.10 లక్షలకు మించి
17) సాహిత్యంలో జ్ఞాన పీఠ్ అవార్డుతో పాటు సినిమాల్లోనూ విలక్షణమైన పాత్రలతో రాణించిన నటుడు బెంగళూరులో కన్నుమూశారు ఆయన ఎవరు ?
జ: గిరీశ్ కర్నాడ్
18) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ యువరాజ్ సింగ్ మొదటి మ్యాచ్ ఏ జట్టుతో ఎప్పుడు ఆడాడు ?
జ: 2000 సంవత్సరంలో కెన్యాతో

అంతర్జాతీయం
19) ప్రధాని నరేంద్ర మోడీ తన మాల్దీవుల పర్యటన తర్వాత శ్రీలంకకు వెళ్లారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ?
జ: మైత్రిపాల సిరిసే
20) పిచర్ గా పిలిచే కొత్తరకం మాంసక భక్ష మొక్కలను ఎక్కడ గుర్తించారు ?
జ: కెనడాలోని ఆంటారియోలో
21) నకిలీ బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తం నగదును విదేశాలకు తరలించిన ఆరోపణల్లో అరెస్ట్ అయినా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఎవరు ?
జ: ఆసిఫ్ అలీ జర్దారీ