Sunday, March 24

CURRENT AFFAIRS – JUNE 1

రాష్ట్రీయం
01) నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పంటకు నీరు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ.7190 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ఏ పథకం కింద ఈ నిధులను కేటాయించారు ?
జ: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన
02) జోగులాంబ గద్వాల జిల్లాలోని కరువు ప్రాంతాలైన గట్టు, ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పథకం ఏది ?
జ: గట్టు ఎత్తిపోతల పథకం
03) ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: చంద్రశేఖర్ రాజనాల
04) సంచార నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వాహనం పేరేంటి ?
జ: స్కిల్స్ ఆన్ వీల్స్

జాతీయం
05) ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా ప్రధానితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: మహతిర్ మహమ్మద్
06) భారత్ ఆర్థిక వ్యవస్థ 2017-18 లో పుంజుకుంది. GDP వృద్ధి రేటు ఎంతగా నమోదైంది ?
జ: 6.7 శాతం
07) 2018లో గడచిన జనవరి - మార్చి నెలలో భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధి ఎంతగా నమోదైంది ?
జ: 7.7శాతం
08) 2018-19 సంవత్సరానికి ఎంతశాతం వృద్ధి రేటు నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ?
జ: 7.5శాతం
09) 2017-18 సంవత్సరంలో భారత తలసరి ఆదాయం ఎంతగా నమోదైంది ?
జ: రూ.1,12,835
(నోట్: 2016-17లో తలసరి ఆదాయం రూ.1,03,870. వృద్ధి రేటు 8.6శాతంగా నమోదైంది )
10) ఆధార్ కేంద్రాలు ఉన్న బ్యాంకు శాఖల్లో ఇప్పటి వరకూ రోజుకి కనీసం 16 మందికి కొత్తగా ఆధార్ నమోదు లేదా సవరణలు చేయాలన్న నిబంధన ఉంది. దీన్ని ఎంతకు తగ్గించారు ?
జ: 8 కి
11) తమ సంపదలో సగానికన్నా ఎక్కువ మొత్తాన్ని విరాళాలుగా ఇస్తామని ప్రకటించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని
12) నందన్ నీలేకని దంపతులు మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, మిలిండా గేట్స్ . వారెన్ బఫెట్స్ సంస్థ స్థాపించిన ఏ స్వచ్ఛంద సంస్థకు ఈ విరాళాన్ని ప్రకటించారు ?
జ: గివింగ్ ప్లెడ్జ్
13) గివింగ్ ప్లెడ్జ్ సంస్థను 40మంది అమెరికన్ కోటీశ్వరులతో 2010లో నెలకొల్పారు. ఇంతవరకూ 22 దేశాలకు చెందిన ఎంతమంది కోటీశ్వరులు ఇందులో చేరారు ?
జ: 183 మంది
14) కోరుకున్న రైలులో సీటు/బెర్త్ దొరక్కపోతే అదే రోజు తర్వాత బయల్దేరే ఏ రైలులోనూ కేటాయించేలా రైల్వే శాఖ అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానం పేరేంటి ?
జ: వికల్ప్
15) పినాక రాకెట్ లో గతంలో 40కిమీ దూరం మాత్రమే ప్రయాణించేది. ఇప్పుడు ఎన్ని కిమీల దూరానికి పెంచారు ?
జ: 70 కిమీ
(నోట్: 44 సెకన్ల వ్యవధిలో 12 రాకెట్లు దూసుకెళ్ళగలవు )
16) టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నతవిద్యాసంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో భారత్ నుంచి 100 స్థానాల్లో చోటు దక్కించుకున్న విద్యాసంసథ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISC- బెంగళూరు )
17) ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు నెలకు ఎంత మొత్తం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు ?
జ: రూ.1000
18) మొబైల్, కంప్యూటర్లలో కొత్తగా చొరబడుతున్న వైరస్ ల పేర్లేంటి ?
జ: పాండా బ్యాంకర్, వర్చువల్ గర్ల్ ఫ్రెండ్
19) దేశంలోని సగానికి పైగా సైబర్ నేరాలు జరుగుతున్న ప్రాంతం ఏది ?
జ: జామ్ తారా ( ఝార్ఖండ్ రాష్ట్రం )
20) IPL-2009 సందర్భంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు BCCI, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, IPL మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు 121 కోట్ల జరిమానా విధించిన సంస్థ ఏది ?
జ: ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED)

అంతర్జాతీయం
21) అమెరికా హవాయ్ లో ఉన్న తమ పసిఫిక్ కమాండ్ పేరును ఏ విధంగా మార్చింది ?
జ: ఇండో పసిఫిక్ కమాండ్
22) ఏయే దేశాలపై ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాల మినహాయింపులను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది ?
జ: ఈయూ, కెనడా, మెక్సికో
23) పాకిస్తాన్ లో ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకున్న నవాజ్ షరీఫ్ పార్టీ పేరేంటి ?
జ: PML-N
(నోట్: అక్కడ 14వ జాతీయ అసెంబ్లీ రద్దయింది. జులై 25న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి )
24) టైమ్స్ ప్రపంచ విద్యా సంస్థల ర్యాంకింగ్స్ - 2018 లో మొదటి స్థానం దక్కించుకున్న సంస్థ ఏది ?
జ: హార్వర్డ్ విశ్వవిద్యాలయం (అమెరికా)