Saturday, August 17

CURRENT AFFAIRS – JUNE 06

తెలంగాణ
01) హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటిన సంస్థలకు ప్రతియేటా ఏ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది ?
జ: హరిత మిత్ర అవార్డులు ( 523 అవార్డులు ఇస్తారు )
02) హరిత మిత్ర అవార్డుల కింద గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎంత మొత్తం ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ
03) మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ల్లో ఏ సభ్యులకు కూడా ఇద్దరు పిల్లల నిబంధన వర్తించనుంది ?
జ: కో-ఆప్టెడ్ సభ్యులు
(నోట్: ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఈ నిబంధన ఉంది )
04) TS IPASS ను విస్తరించండి ?
జ: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
05) తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం TS IPASS గడువు 2019 మార్చి 31తో ముగిసింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2015 జూన్ 12 నుంచి
06) TS IPASS ను రాష్ట్రంలోని ఎన్ని ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చింది ?
జ: 14 ప్రాధాన్యతా రంగాలు
07) దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు 20.8శాతంగా ఉంది. అయితే 2015-18 లో తెలంగాణ వృద్ధి రేటు ఎంతగా నమోదైనట్టు అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్; ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ( అసోచామ్ ) ప్రకటించింది ?
జ: 68.5శాతం
08) 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లకు చేరాయి ?
జ: రూ.5.9 లక్షల కోట్లు
09) రాష్ట్ర కొత్త సెక్రటరియేట్ డిజైన్ రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పగించింది ?
జ: ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్

జాతీయం
10) దేశంలోనే మొదటిసారిగా ఏయే అంశాలపై సూచనలు ఇవ్వడానికి రెండు మంత్రి వర్గ సంఘాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు ?
జ: ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన
11) పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి రంగానికి సంబంధించిన కమిటీలో ఎవరెవరు ఉంటారు ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్
12) ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ఏర్పడే కమిటీలో ఎవరెవరు ఉంటారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్ సింగ్ పురీ.
13) టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి లోగా ఈ చట్టం తేనున్నారు ?
జ: 2022 లోపు
14) టైటిల్ గ్యారంటీ చట్టాన్ని మొదటగా ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: హరియాణాలో
15) యూపీఏ హయాంలో భూ సంస్కరణల ముసాయిదా చట్టాన్ని ఏ ఏడాదిలో ప్రవేశపెట్టారు ?
జ: 2011 లో
16) దేశంలో పట్టణాల్లో నిరుద్యోగిత శాతం ఎంతగా ఉంది ?
జ: 23.7శాతం
17) తెలంగాణ, ఏపీల్లో పట్టణాల్లో నిరుద్యోగిత శాతం ఎంతగా ఉంది ?
జ: తెలంగాణ : 32.8శఆతం, ఏపీలో 26.9శాతం
18) జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు ఎంతశాతానికి చేరుకుందని జాతీయ గణాంక శాఖ సర్వే ప్రకటించింది ?
జ: 6.1శాతం
19) దేశంలో 15 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే కొత్తగా ఎన్ని ఎక్స్ ప్రెస్ మార్గాలను అభివృద్ధి చేయనున్నారు ?
జ: 22 మార్గాలు
20) భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడిన ఉన్నట్టు ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. రాబోయే మూడేళ్ల దాకా భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది ?
జ: 7.5 శాతం
21) కిందటేడాది (2018-19)లో సేవా రంగంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఎంత మొత్తం భారత్ కు వచ్చింది ?
జ: 9.15 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.64 వేల కోట్లు )
(నోట్: అంతకు ముందు ఏడాది 2017-18లో 6.7 బిలియన్ డాలర్లు... దాదాపు 47 వేల కోట్లు )
22) దేశంలో చనిపోతున్న చిన్నారుల్లో వాయు కాలుష్యంతో చనిపోతున్న వారి శాతం ఎంతగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ప్రకటించింది ?
జ: 12.5శాతం
23) దేశంలో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ( CSE) ప్రకటించిన నివేదిక పేరేంటి ?
జ: భారత్ లో పర్యావరణ పరిస్థితి ( SOE)

అంతర్జాతీయం
24) టెక్నాలజీ రంగంలో చేసిన విశిష్ట సేవలకు భారత సంతతికి చెందిన గూగుల్ CEO సుందర్ పిచాయ్ కి గ్లోబల్ లీడర్ షిప్ ను ఏ సంస్థ ప్రకటించింది ?
జ: అమెరికా - భారత వాణిజ్య మండలి ( USIBC)
25) అమెరికా ప్రతినిధుల సభలో తాత్కాలిక స్పీకర్ గా ఎంపికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళ ఎవరు ?
జ: ప్రమీల జయపాల్
26) ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల రక్షణ బడ్జెట్ ను తగ్గించుకున్న మన పొరుగు దేశం ఏది ?
జ: పాకిస్తాన్
27) నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన దేశం ఏది ?
జ: చైనా
28) నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి చైనా ప్రయోగించిన రాకెట్ ఏది ?
జ: చాంగ్ ఝెంగ్ 11 వాహక రాకెట్

 

Friends,

మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుండానే... మీకు సబ్జెక్ట్ మెటీరియల్; నిపుణుల అభిప్రాయాలతో యూట్యూబ్ క్లాసులు అందిస్తున్నాం.  ఈ కింది లింక్ ద్వారా మీరు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe అవ్వండి. మేం ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే సమాచారం వస్తుంది.  మీ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, మెయిల్... ఇలా అన్ని సోషల్ మీడియా గ్రూపులకు దయచేసి ఈ లింక్ ను ఫార్వార్డ్ చేయండి.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true