Friday, November 16
Log In

CURRENT AFFAIS – 5TH JULY

రాష్ట్రీయం
1) తెలంగాణలో రూ.1200 కోట్లతో ఏర్పాటు కాబోయే కేంద్ర ప్రభుత్వం సంస్థ ఏది ?
జ: పౌర విమానయాన పరిశోధనా సంస్థ ( కారో )
(నోట్: బేగంపేట విమానాశ్రయంలో 27 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు )
2) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి
(నోట్: గతంలో ఆర్టీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ పనిచేస్తున్నారు. ఆయన పదవీ విరమణ చేశారు. నర్సింహారెడ్డి మూడేళ్ళ పాటు ఈ పదవిలోఉంటారు )
3) ఐటీ ఆధారిత, బ్లాక్ చైన్, ఇతర కొత్త సాంకేతిక రంగాల్లో పరస్పర అవగాహన కోసం ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ?
జ: నీతి ఆయోగ్ తో

జాతీయం
4)మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సిందే అని ఏ లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో సుప్రంకోర్టు స్పష్టం చేసింది.?
జ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
(NOTE: ప్రస్తుత గవర్నర్ అనిల్ బైజల్)
5) 2018-19 ఖరీఫ్ సీజన్ కి ఎన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: 14 రకాలు
6) వరికి కేంద్రం పెంచిన రూ.200 లతో ఇప్పుడు కనీస మద్దతు ధర ఎంతగా ఉంది ?
జ: రూ.1750 (సాధారణం), రూ.1770 ( గ్రేడ్ -ఎ)
7) గత ఏడాది మద్దతు ధరతో పోలిస్తే 50శాతం ధర పెరిగిన తృణ ధాన్యాలు ఏవి ?
జ: రాగులు ( గతఏడాది 1900, ఈ ఏడాది రూ. 2897)
8) మద్దతు ధర పెంపుతో ప్రభుత్వం ఇచ్చే ఆహార సబ్సిడీ వ్యయం ప్రస్తుతం రూ.1.70 లక్షల కోట్లు ఉండగా, అది ఎన్ని లక్షల కోట్లకు దాటుతుంది ?
జ: రూ.2లక్షల కోట్లు
9) దృష్టి లోపం ఉన్న ఓటర్లకు బ్రెయిలీ లిపిలో ఓటర్ కార్డులను ఎన్నికల కమిషన్ అందచేస్తోంది. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
జ: ఓ.పి.రావత్
10) భారత్ లోకి అడుగుపెట్టనున్న చైనా బ్యాంకు ఏది ?
జ: బ్యాంక్ ఆఫ్ చైనా
(నోట్: గతంలో ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా మన దేశంలో నడుస్తోంది )

అంతర్జాతీయం
11) అమెరికాలో డ్రగ్స్ నియంత్రణ చీఫ్ (డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ - యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ ) గా నియమితుడైన ఇండో అమెరికన్ ఎవరు ?
జ: ఉత్తమ్ థిల్లాన్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/