Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS – JULY 9

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ప్రారంభమైంది
జ: ములుగు (గజ్వేల్ నియోజకవర్గం)
2) రాష్ట్రంలో శిశుమరణాల రేటు ఎంతకు తగ్గింది ?
జ: 39 శాతం నుంచి 31 శాతానికి

జాతీయం
3) భారత్ లో పర్యటిస్తున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు ?
జ: మూన్ జె ఇన్
4) దూర ప్రాంతాలకు వెళ్ళే రైలు ప్రయాణీకుల కోసం ఏ రైలులో ఎలాంటి వంటకాలు ఉంటాయో తెలిపే యాప్ రిలీజ్ చేశారు. దాని పేరేంటి ?
జ: మెనూ ఆన్ రైల్స్
5) ఇసుక తుఫాన్లను ఎదుర్కొనేందుకు రాజధాని నగరం ఢిల్లీలో ఎన్ని దేశవాళీ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 31 లక్షలు
6) 50 యేళ్ళు దాటిన ప్రభుత్వం ఉద్యోగులు పనిచేయకపోతే నిర్భంద పదవీ విరమణ చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఉత్తరప్రదేశ్
7) భారతీయ చారిత్రక పత్రాల ( ఆర్కైవ్స్ ) కమిటీ 62వ జాతీయ సదస్సును 2018 జులై 20,11తేదీల్లో ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: హైదరాబాద్ లో
8) FIG ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాలెంజ్ కప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ఎవరు ?
జ: దీపా కర్మాకర్
9) ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం (అర్జెంటీనా, చిలీ సరిహద్దుల్లోని ఓజోస్ డెల్ సలాడో) అధిరోహించిన రెండో భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: సత్యరూప్ సిద్దాంతహాస్

అంతర్జాతీయం
10) థాయ్ లాండ్ లో 12 మంది చిన్నారులతో పాటు ఫుట్ బాల్ కోచ్ చిక్కుకు పోయిన గుహ పేరేంటి ?
జ: తామ్ లుయాంగ్ గుహ