Thursday, September 19

CURRENT AFFAIRS JULY 9

తెలంగాణ
01) రాష్ట్రంలో బీసీలుగా కొనసాగుతున్న ఎన్ని కులాలను ఓబీసీల్లో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ జాతీయ కమిషన్ ను కోరింది ?
జ: 15 కులాలు
02) ఏ దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసేందుకు తెలంగాణ దరఖాస్తు పంపింది ?
జ: యూరోపియన్ యూనియన్

జాతీయం
03) దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద 2018-19 లో ఎంత మొత్తం విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది ?
జ: రూ.5,239 కోట్లు
04) దేశంలో ప్రత్యేక ప్యాకేజీ పొందుతున్న రాష్ట్రాల్లో అత్యధికంగా ఏ రాష్ట్రానికి నిధులు అందుతున్నాయి ? ఎంత మొత్తం ?
జ: త్రిపుర రూ.1858.70 కోట్లు
05) 10 రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా తెలంగాణ, ఏపీకి ఎంత మొత్తం అందనున్నాయి ?
జ: తెలంగాణకి రూ.450 కోట్లు, ఏపీకి 15 కోట్లు
06) యువతను నైపుణ్యాభివృద్ధి సాధన దిశగా ప్రోత్సహించేందుకు, వారి ఆలోచనలు తెలుసుకునేందుకు ఏ కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది ?
జ: కౌశల్ యువ సంవాద్
07) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకంనకు కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.87 వేల కోట్లు
08) ఏడాది రూ.6 వేలు చొప్పున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకంను ఎంతమంది రైతులకు అందించనున్నారు ?
జ: 14.5 కోట్ల మంది రైతులు
09) ఈ-పాన్ నెంబర్ ను ఎన్ని నిమిషాల్లో కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు ?
జ: 10 నిమిషాల్లో
10) టైర్లలో గాలికి బదులు ఏ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది ?
జ: నైట్రోజన్
11) 1500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా త్రీడీ రామాయణాన్ని ఎవరు నిర్మిస్తున్నారు ?
జ: అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన
12) భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 3డీ రామాయణం చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ?
జ: దంగల్ దర్శకుడు నితీష్ తివారి, మామ్ దర్శకుడు రవి ఉద్యావార్

అంతర్జాతీయం
13) అంగారకుడి పైకి మొదటిసారిగా యాత్ర చేపడుతున్న ఓ దేశం రోవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. వచ్చే ఏడాది ఈ రోవర్ ను ప్రయోగించనుంది. ఆ దేశం ఏది ?
జ: చైనా
14) 5 లక్షల మంది ప్రయాణీకుల డేటా ఉల్లంఘన కేసులో ఏ విమానయాన సంస్థకి 183 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.1650కోట్లు) పన్ను విధస్తున్నట్టు బ్రిటన్ డేటా నియంత్రణ సంస్థ ప్రకటించింది ?
జ: బ్రిటీష్ ఎయిర్ వేస్