Wednesday, June 19

CURRENT AFFAIRS JULY 8TH

రాష్ట్రీయం
1) వచ్చే 3యేళ్ళల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఎన్నికోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ?
జ: రూ.45వేల కోట్లు (రాష్ట్రంలోని మిగిలిన నగరాలకు రూ.10వేల కోట్లు)
2) రాష్ట్రంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా 33శాతం గ్రీన్ కవరేజ్ కోసం ఏటా ఎన్ని మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నిర్దేశించారు ?
జ: 100 కోట్లు
3) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
4) భారత రాజ్యాంగంలోని అధికరణలు, సామాజిక న్యాయ అంశాలు, వివిధ కమిషన్ల వివరాలు, హక్కులు, రిజర్వేషన్లు సమాచారంతో రాష్ట్ర బీసీ కమిషన్ రూపొందించిన పుస్తకం పేరేంటి ?
జ: బీసీ నోట్ బుక్
5) తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కొత్త డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: విజయ్ కుమార్
6) అత్యంత వేగంగా ఆధార్ నమోదు చేసినందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ కు దేశంలో ఎన్నో స్థానం దక్కింది ?
జ: మూడో స్థానం
(నోట్: UIDAI ప్రకటించిన లిస్ట్ లో పంజాబ్, బిహార్ పోస్టల్ సర్కిల్స్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి )
7) పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు 20వ ప్రపంచ కాంగ్రెస్ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ అవార్డుల్లో గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కించుకున్న మన రాష్ట్రానికి చెందిన సంస్థ ఏది ?
జ: రామగుండం NTPC

జాతీయం
8) ఇకపై ఏ కేంద్ర బలగాలకు రైల్వే వారెంట్ బదులు ఇ-టికెటింగ్ విధానాన్ని అమలు పరచనున్నారు ?
జ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
9) GSTపై వినియోగదారులు మోసపోకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ( CBIC) GST వెరిఫై అనే యాప్ ను ప్రవేశపెట్టింది. దీన్ని ఎవరు రూపొందించారు ?
జ: బి.రఘు కిరణ్ ( జాయింట్ కమిషనర్ ఆఫ్ GST, హైదరాబాద్ )
10) పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: విశ్వాస్ పాటిల్
11) బొగ్గు గనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ఏది ?
జ: ఖాన్ ప్రహరి
12) పోషకాహార సమస్యను అధిగమించడానికి పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: గుజరాత్
13) డిజైన్ యూనివర్సిటీ ఫర్ గేమింగ్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో UNESCO ఒప్పందం చేసుకుంది ?
జ: ఆంధ్రప్రదేశ్
14) వృద్ధుల సంక్షేమం కోసం తెచ్చిన చట్టంలో కొడుకులు, కూతుళ్ళతో పాటు ఎవర్ని కూడా సంతానంలో భాగంగా చూసేలా కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదిస్తోంది ?
జ: అల్లుళ్ళు, కోడళ్ళు
15) 2018 తబిలిసి గ్రాండ్ ప్రిక్స్ తో రెజ్లర్ బజ్ రంగ్ పూనియా ఏ కేటగిరీలో స్వర్ణం గెలుచుకున్నాడు ?
జ: 65 కేజీల కేటగిరీలో

అంతర్జాతీయం
16) సిరియా రాజధాని డమాస్కస్ లో ఓ గూఢచారి గడియారం కోసం అణువణువునా గాలించి చివరకు దాన్ని సంపాదించింది. ఇది ఏ ఇజ్రాయెల్ హీరోది ?
జ: ఎలీ కోహెన్
17) బంగ్లాదేశ్ కు శరణార్ధులుగా వెళ్ళిన 9 లక్షల మంది రోహింగాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన సంస్థ ఏది ?
జ: ఐక్యరాజ్యసమితి శరణార్ధి సంస్థ
18) శ్రీలంకలోని హంబనంటోటాలో నష్టాల్లో ఉన్న మట్టాల రాజక్ష అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నడపడానికి ఏ దేశం ముందుకు వచ్చింది ?
జ: భారత్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/