Sunday, February 23

CURRENT AFFAIRS JULY 7 & 8

తెలంగాణ
01) సెప్టెంబర్ మొదటి వారం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులను ప్రారంభిస్తామని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) కేంద్రానికి నివేదిక పంపింది. అయితే 2019-20 విద్యా సంవత్సరానికి గిరిజన వర్సిటీ తరగతులు రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి ?
జ: ములుగు జిల్లా జాకారంలోని గిరిజన యువజన శిక్షణ కేంద్రంలో
02) జాతీయ బీసీ కమిషన్ మొదటిసారి హైదరాబాద్ లో పర్యటించింది. ఈ కమిషన్ కు ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ?
జ: భగవాన్ లాల్ సహానీ ( వైస్ ఛైర్మన్: డాక్టర్ లోకేష్ కుమార్ ప్రజాపతి)
03) ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 8 దేనికి సంబంధించినది ?
జ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పరిధిలోని అంశాల్లో గవర్నర్ కు బాధ్యత
04) నా మాటే తుపాకీ తూట - అనే పుస్తకం ఎవరి ఆత్మకథ ?
జ: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం
(నోట్: ఈ పుస్తకాన్ని రాసింది విమల, కాత్యాయని, ఉమా చక్రవర్తి )

జాతీయం
05) మలేరియా వ్యాధి కారక ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ అనే పరాన్న జీవిని పూర్తిగా చంపేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) బయోకెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్న మందు పేరేంటి ?
జ: BO2
(నోట్: వర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగాధిపతి మ్రిణాల్ కాంతి భట్టాచార్య పర్యవేక్షణలోని బృందం)
06) ఎన్నివేల రూపాయలకు పైబడిన లావాదేవీలపై పాన్ కు బదులు ఆధార్ ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు ?
జ: రూ.50 వేలు
07) చోరీ అయిన లేదా పోగొట్టుకున్న ఫోన్ల ఆచూకీ కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ కొత్త టెక్నాలజీ ఆవిష్కరిస్తోంది. దాని పేరేంటి ?
జ: సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ ( CEIR)
08) CEIR ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
జ: సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలీ మ్యాట్రిక్స్ ( సీ-డాట్)
09) దేశంలోని ఏ చరిత్రాత్మక నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరుస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది ?
జ: జైపుర్
(నోట్: ప్రపంచ వారసత్వ కమిటీ 43వ సదస్సు అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతోంది )
10) జైపుర్ నగరాన్ని 1727లో ఎవరి ఆధ్వర్యంలో నిర్మించారు ?
జ: సవాయ్ జైసింగ్ - 2
11) దిగువ కోర్టు జడ్జికి హైకోర్టు విధించిన తప్పనిసరి పదవీ విరమణను పక్కన పెట్టడంతో పాటు... లక్ష రూపాయల స్వీయ జరిమానా విధించుకున్న న్యాయస్థానం ఏది ?
జ: కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్
12) 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంతో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని తయారు చేస్తున్నారు. దీన్ని భారత్ ఏ దేశంతో కలసి రూపొందించింది ?
జ: రష్యాతో కలసి
13) 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ క్రికెట్ జట్టు మొట్టమొదటి ప్రపంచ కప్ ను దేశానికి అందించింది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తీస్తున్న 83గా తీస్తున్న సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ?
జ: రణ్ వీర్ సింగ్

అంతర్జాతీయం
14) వేస్ట్ జనరేషన్ ఇండెక్స్ అధ్యయనంలో ప్రపంచంలో ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
జ: అమెరికా
15) అమెరికాలో ఏడాదికి తలసరి వ్యర్థాలు ఎన్ని కిలోలుగా ఉన్నాయి ?
జ:773 కిలోలు

 

తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేసుకోండి 

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true