Thursday, June 27

CURRENT AFFAIRS JULY 30 & 31

రాష్ట్రీయం
01) లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మూడు కేజీలతో బంగారు బోనం సమర్పించింది ఎవరు ?
జ: ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
02) లష్కరే బోనాలలో రంగం వేదికపై భవిష్యవాణి చెప్పిన మాతంగి ఎవరు ?
జ: స్వర్ణలత
03) ఒలింపిక్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ?
జ: మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి
04) తిరుపతిలో లాగే శిల్ప కళాశాలను ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: యాదాద్రి భువనగిరి జిల్లాలో
05) ప్రణాళిక శాఖ సూచనతో కౌన్సెల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక - 2018 ని ఎవరు రూపొందించారు ?
జ: కల్పనా కన్నవీరాన్, పద్మినీ స్వామి నాథన్, జయరాజన్
06) తగిన వయసు రాకుండానే పెళ్ళి చేయడం, మేనరికాలు దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ?
జ: తెలంగాణలో
07) తెలంగాణ తొలితరం గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు రాంజీగోండు గిరిజన మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: హైదరాబాద్ బాపూ ఘాట్ లోని ఎకరన్నర స్థలంలో
08) సిటీలో ఏ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ?
జ: శామీర్ పేట

జాతీయం
09) జాతీయ పౌర నమోదు కార్యక్రమం ( నేషనల్ రిజిష్టర్ సిటిజన్స్ ) ను ఏ రాష్ట్రంలో ప్రకటించారు ?
జ: అసోంలో
10) అసోంలో విడుదలైన జాతీయ పౌర నమోదు కార్యక్రమంలో దాదాపు ఎంతమందికి చోటు దక్కలేదు ?
జ: 40.07 లక్షల మంది
11) అవినీతిని నిరోధించేందుకు లోక్ పాల్ నియామకంలో జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా 2018 అక్టోబర్ 2 నుంచి నిరసన దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన సామాజిక కార్యకర్త ఎవరు ?
జ: అన్నా హజారే
12) పొగాకు వాడకంతో వచ్చే తల, గొంతు క్యాన్సర్ రోగుల్లో ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఏ దేశంలో ఉన్నారు ?
జ: భారత్ 57.5శాతం
13) ట్రాయ్ ఛైర్మన్ ఎవరు ?
జ: ఆర్.ఎస్.శర్మ
14) 2019-20 కి థర్డ్ పార్టీ మోటర్ కవరేజ్ పై ప్రీమియం రేట్లు నిర్ణయించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నియమించి 16 మంది సభ్యుల కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: పి.జె. జోసెఫ్ కమిటీ
15) ఒడిశాకి చెందిన అత్యున్నత సాహితీ పురస్కారం అతిబాదీ జగన్నాధ్ దాస్ సమ్మాన్ 2018 కి ఎంపికైనది ఎవరు ?
జ: రమాకాంత రథ్
16) ఫిన్ లాండ్ లో జరుగుతున్న సావో గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న భారత జావెలిన్ త్రోయర్ ఎవరు ?
జ: నీరజ్ చోప్రా
17) ఆఫ్రికాలోని టాంజనీయాలో ఉన్న ఎత్తయిన శిఖరం మౌంట్ కిలిమంజారోని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు ?
జ: శివంగి పాఠక్ ( హర్యానా )
18) రష్యన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ట్రోఫీ 2018 గెలుచుకున్న భారతీయ షట్లర్ ఎవరు ?
జ: సౌరబ్ వర్మ
19) గ్రామీణ ప్రాంతాల అభిమానుల కోసం ప్రో కబడ్డీ ఆరో సీజన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది ?
జ: 2018 అక్టోబర్ 5 నుంచి
20) లాస్ ఏంజెల్స్ లో జరిగిన మూడో లవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018 లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన అస్సామీ మూవీ ఏది ?
జ: Xhoihobote Dhemalite

అంతర్జాతీయం
21) కాంబోడియా ఎన్నికల్లో ఏ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంది ?
జ: సీపీపీ ( ప్రధాని హసన్ సేన్ )
22) 2018 జులై 29నాడు ఇండోనేషియాలోని ఏ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం వచ్చింది ?
జ: లోంబోక్ కేంద్రంగా
23) పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ?
జ: 2018 ఆగస్టు 11న (పార్టీ : పాకిస్తాన్ తెహ్రీక్ -ఎ- ఇన్సాఫ్ - PTI)
24) 2018 జులై 28న జరుపుకున్న వరల్డ్ హెపటైటిస్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Test. Treat. Hepatitis

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/