Friday, February 22

CURRENT AFFAIRS – JULY 3 &4

రాష్ట్రీయం
01) గోదావరి నదిపై మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం చేపడుతోంది ?
జ: ఒడిశా
02) ఇండియా టుడే మేగజైన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన 38 బెస్ట్ యూనివర్సిటీల సర్వేలో మన రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎన్నో స్థానం దక్కింది ?
జ: 3 వ స్థానం
(నోట్: ఉస్మానియాకి నాలుగో స్థానం)
03) బయోపోర్టిఫికేషన్ పద్దతిలో దేశంలోనే మొదటిసారిగా అధిక దిగుబడి ఇచ్చే జొన్న వంగడాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
జ: ఇక్రిశాట్

జాతీయం
04) ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్ ఏది ?
జ: సీవిజిల్ ( సిటిజన్స్ విజిల్ )
05) జీడీపీ గణాంకాలను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ (ఆధార సంవత్సరం) 2011-12. దీన్ని ఏ ఏడాదికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2017-18
06) రిటైల్ ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ ప్రస్తుతం 2012. దీన్ని ఏ ఏడాదికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2018
07) ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
జ: నాలుగో స్థానం ( 2.26 లక్షల కోట్ల డాలర్లు )
(నోట్: మొదటిది : అమెరికా 18.57 లక్షల కోట్ల డాలర్లు, రెండోవది చైనా: 11.2 ల.కో.డా, మూడోవది జపాన్ : 4.94.లక్షల కోట్ల డాలర్లు )
08) గుజ్జర్లను ఏ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు ?
జ: రాజస్థాన్
09) మొండి బకాయిల సమస్యతో పోరాడేందుకు ఏ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: బ్యాడ్ బ్యాంక్
10) బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన కమిటీ ఏది ?
జ: సునీల్ మెహతా
11) సెయిల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సరస్వతీ ప్రసాద్ ( సీనియర్ ఐఏఎస్ అధికారి)
12) టెక్నాలజీ సహకారం అందించేందుకు నాస్ డాక్ తో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ ఒప్పంద కుదుర్చుకుంది. నాస్ డాక్ ఏ దేశానికి చెందిన స్టాక్ ఎక్చేంజ్ ?
జ: అమెరికా
13) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: అరిజిత్ బసు
14) యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ ఎవరు ?
జ: శిఖా శర్మ
15) షేర్లలో 6 వారాలకు పైగా ట్రేడింగ్ సస్పెండ్ కావడంతో ఎన్ని కంపెనీలను డీలిస్ట్ చేస్తున్నట్టు బాంబే స్టాక్ ఎక్చేంజ్ (BSE) ప్రకటించింది ?
జ: 222
16) జీఎస్టీ పేరుతో అక్రమ వసూళ్ళని గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్ ఏది ?
జ: జీఎస్టీ వెరిఫై
17)12.5 అడుగుల ఎత్తుతో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: కలపర్రు (ప.గో జిల్లా -ఏపీ)
18) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: రాహుల్ ద్రవిడ్
19) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇప్పటిదాకా ఎంతమంది భారతీయ క్రికెటర్లకు చోటు దక్కాయి ?
జ: ఐదుగురు
(నోట్: బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే )
20) ఆసియా క్రీడలకు మొత్తం 524 మంది క్రీడాకారులు వెళ్తున్నారు. అయితే వీరు ఎన్ని క్రీడాంశాల్లో పతకాల కోసం పోటీ పడతారు ?
జ: 36 క్రీడాంశాలు

అంతర్జాతీయం
21) అంతరిక్ష రంగంలో నాసా కన్నా శక్తివంతమైన రాకెట్ ను చైనా తయారు చేస్తోంది. 2030 కల్లా సిద్ధం చేయాలని భావిస్తోంది. ఆ రాకెట్ పేరేంటి ?
జ: లాంగ్ మార్చ్ -9
(నోట్: దిగువ భూ కక్ష్యలోకి 140 టన్నుల బరువును మోసుకెళ్ళగలదు )
22) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఎవరు ?
జ: రికీ పాంటింగ్
23) మెక్సికో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్
(నోట్: నేషనల్ రీజెనరేషన్ మూవ్ మెంట్ పార్టీ నేత, కమ్యూనిస్ట్ నేత)
24) మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగా బంతిని టాంపరింగ్ చేస్తే క్రికెటర్లకు ఎన్ని టెస్టులు, వన్డేలు నిషేధం విధించాలని ఐసీసీ నిర్ణయించింది ?
జ: 6 టెస్టు మ్యాచ్ లు లేదా 12 వన్డేలు
25) 2018 ఆసియా క్రీడలు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఎక్కడ జరగనున్నాయి ?
జ: ఇండోనేషియా
26) భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను పరిశీలించే ఐక్యరాజ్య సమితి విభాగానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఉరుగ్వే ఆర్మీ మాజీ అధికారి జోస్ ఎలాడియో అక్లెయిన్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/