Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 28TH

రాష్ట్రీయం
01) రాష్ట్రంలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న పెద్దపులికి అరుదైన గౌరవం దక్కింది. ఈ పెద్దపులి ఉన్న ఫోటోని పోస్టల్ స్టాంప్ పై ముద్రించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ పులి పేరేంటి ?
జ: ఫాల్గుణ

జాతీయం
02) కర్ణాటక లోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ వైద్య శాలలో రక్తనిధి కేంద్రం విభాగం నిర్వాహకురాలు డాక్టర్ శమీ శాస్త్రి నేతృత్వంలోని వైద్యులు కొత్త రక్త గ్రూపును కనుగొన్నారు. దీనికి ఏమని పేరు పెట్టారు.
జ: పి - నల్
03) వ్యక్తిగత గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ వ్యక్తగత సమాచార భద్రత బిల్లును - 2018 ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లును సిఫార్సు చేసిన అత్యున్న స్థాయి సంఘంనకు ఎవరు నేతృత్వం వహించారు ?
జ: జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
04) 2001 తర్వాత మొదటిసారిగా మొండి బకాయిల కారణంగా నష్టాలు ప్రకటించిన ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ?
జ: ICICI
05) జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు ?
జ: జస్టిస్ ఏకే గోయల్
06) జాతీయ మహిళా సంఘం ఛైర్ పర్సన్ గా ఎవరు కొనసాగుతున్నారు ?
జ: రేఖా శర్మ
07) రైల్వే అధికారులు, సూపర్ వైజర్లు విధుల్లో పారదర్శకత పాటించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఏది ?
జ: మిషన్ సత్యనిష్ట
08) ఎన్నారైలు కూడా ఓట్లేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చట్ట సవరణ చేసింది ?
జ: 2010లో
09) 2018 ఆగస్టు 18 నుంచి జకర్తాలో జరిగే ఆసియా క్రీడల్లో భారతీయ క్రీడాకారులు ఎంతమంది పాల్గొంటున్నట్టు భారత్ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
జ: 541 మంది
10) అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య డోపింగ్ టెస్టులో పట్టబడిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత, లిఫ్టర్ ఎవరు ?
జ: సంజిత చాను
11) ప్రముఖ డైరక్టర్, కళా తపస్వి కె.విశ్వనాథ్ జీవితంపై వస్తున్న బయోపిక్ మూవీ పేరేంటి ?
జ: విశ్వదర్శనం

అంతర్జాతీయం
12) ప్రపంచంలోనే అత్యంత వృద్ద వ్యక్తిగా గుర్తింపు పొందిన 117యేళ్ళ బామ్మ మియాకో చనిపోయింది. ఆమె ఏ దేశస్థురాలు ?
జ: జపాన్