Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 27

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో ఎన్ని కులాలను అత్యంత వెనుకబడిన కులాలు (MBC) లుగా ప్రభుత్వం గుర్తించింది ?
జ: 36 కులాలను
(నోట్ : వీరిని బీసీ-ఎలుగా గుర్తిస్తారు )
02) 2018-19 రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీల అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఎంత ప్రత్యేక నిధిని ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.5,171 కోట్లు
03) రాష్ట్రంలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు లభించింది ?
జ: 10 PHCలకు
04) తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహాలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అనుబంధ వైద్య కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది ?
జ: బీబీ నగర్
05) రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి 38,339 మందికి ఎన్నికోట్లతో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని ట్రైకార్ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ ) నిర్ణయించింది ?
జ: రూ.406.18 కోట్లు


06) తెలంగాణ గిరిజన కళకు కొత్త లోగోను తయారు చేయనున్నారు. ఏయే తెగల చిత్రకళల ప్రోత్సాహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ?
జ: గోండు, కోయ తదితర
07) వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరుగుతాయి ?
జ: ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ
08) హైదరాబాద్ వేదికగా 2018 ఆగస్టు 3,4 తేదీల్లో జరగబోయే అంతర్జాతీయ సదస్సు ఏది ?
జ: బ్లాక్ చైన్ కాంగ్రెస్

జాతీయం
09) ఈ ఏడాది ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె పురస్కారం ఇద్దరు భారతీయులకు దక్కింది. వాళ్ళెవరు ?
జ: భరత్ వట్వాని, సోనమ్ వాంగ్ చుక్
10) రామన్ మెగసెసె అవార్డుకి ఎంపికైన మానసిక వైద్య నిపుణుడు భరత్ వట్వానీ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: సామాజిక సేవ (మానసిక వైద్య నిపుణుడు)
11) సృజనాత్మక అభ్యసన పద్దతులతో లదాఖ్ యువతలో విద్యా, జీవన నైపుణ్యాలను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న ఎవరికి భారత్ తరపున రామన్ మెగసెసె అవార్డు దక్కింది ?
జ: సోనమ్ వాంగ్ చుక్
12) ఇటీవల జీఎస్టీ మండలి 88 రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. అవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: 2018 ఆగస్టు 27
13) పశ్చిమబెంగాల్ పేరును ఏ విధంగా మారుస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది ?
జ: బంగ్లా
(నోట్: ఇంగ్లీష్ అక్షరమాలలో W చివర్న ఉండటంతో రాష్ట్రం పేరును మార్చారు. అయితే గతంలో బెంగాలీలో బంగ్లా, ఇంగ్లీష్ లో బెంగాల్, హిందీలో బంగాల్ గా మార్పు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇచ్చిన తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించింది. దాంతో ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండాలే బంగ్లా పేరును సూచించారు )
14) ఏ ఇద్దరు న్యాయవాదులను న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ కొలీజియం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ?
జ: హర్ నరేష్ సింగ్, మహ్మద్ నిజాముద్దీన్
15) ఆదిత్యా బిర్లా గ్రూప్ నకు చెందిన హిందాల్కో గ్రూపు అమెరికాకి చెందిన ఏ అల్యూమినియం సంస్థను రూ.17,500 కోట్లతో కొనుగోలు చేసింది ?
జ: అలెరిస్
(నోట్: దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అల్యూమినియం కంపెనీగా హిందాల్కో నిలవనుంది.
16) భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఎన్నో స్థానంలో నిలచింది ?
జ: నెంబర్ వన్
17) భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ నుంచి సేకరించిందన్న ఆరోపణలతో లండన్ కు చెందిన ఏ సంస్థపై CBI దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు ?
జ: కేంబ్రిడ్జి అనలిటికా
18) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకూ పెంచింది ?
జ: 2018 ఆగస్టు 31
(నోట్: గతంలో ఇది జులై 31 వరకూ ఉండేది )
19) గడువు లోగా ఆదాయపు పన్ను రిటర్న్ వేయకపోతే ఎంత మొత్తం జరిమానా విధిస్తారు ?
జ: రూ.10 వేలు

అంతర్జాతీయం
20) బ్రిక్స్ దేశాల సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: జోహన్నెస్ బర్గ్ ( దక్షిణాఫ్రికా )
21) బ్రిక్స్ లో ఉన్న సభ్య దేశాలు ఏవి ?
జ: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా
22) ఏ దేశంలో ద్రవ్యోల్భణం 10 లక్షల శాతానికి చేరుకోవడంతో ఒక చాయ్ ని 2000 బోలివర్స్ కి అమ్ముతున్నారు ?
జ: వెనెజులా

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/