Thursday, June 27

CURRENT AFFAIRS JULY 26

రాష్ట్రీయం
01) నాలుగో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించనున్నారు ?
జ: ఆగస్టు 1న గజ్వేల్ లో
02) 2018 ఆగస్టు 1న జరిగే నాలుగో విడత హరితహారంలో ఒక్క రోజులో ఎన్ని మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 1,00,116 మొక్కలు
03) కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ ( బిల్ట్ ) పునరుద్దించబోతున్నారు. ప్రస్తుతం ఈ రేయాన్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లాలో ఉంది ?
జ: భూపాలపల్లి జిల్లా కమలాపూర్
04) బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచారం ఉద్యమంలో భాగంగా వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పుస్తకం పేరేంటి ?
జ: మై బాడీ ! వాట్ ఐ సే గోస్ ( నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది )
05) ఈసారి బోనాల ఉత్సవంలో ఏ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు ?
జ: సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో

జాతీయం
06) దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలికలకు ప్రతినెలా ఎంత మొత్తం చొప్పున స్టైఫండ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.200లు
(నోట్: సమగ్ర శిక్షా అభియాన్ కింద 5-18 యేళ్ళ లోపు దివ్యాంగ బాలికలకు ఈ మొత్తం ఇస్తారు )
07) 40యేళ్ళ వయస్సులో అత్యంత ప్రభావశీల, స్ఫూర్తి దాయక వ్యాపారవేత్తులగా రాణించిన 40మందితో ఫార్చ్యూన్ ప్రకటించిన నివేదికలో స్థానం దక్కించుకున్న భారతీయులు ఎవరు ?
జ: జనరల్ మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దివ్యా సూర్యదేవర (4వ స్థానం )
మిమియో CEO అంజలి సూద్ (14వ స్థానం )
08) 2018 అక్టోబర్ నుంచి ఏ స్టాక్ ఎక్చేంజ్ లో డెరివేటివ్స్ ట్రేడింగ్ తో పాటు కమోడిటీల్లో కూడా అర్థరాత్రి దాకా ట్రేడింగ్ ప్రారంభించనున్నారు ?
జ: ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (NSE)

అంతర్జాతీయం
09) పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలుపు దిశగా ఉంది. ఆ పార్టీ పేరేంటి ?
జ: పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ ( PTI)
10) 40యేళ్ళ వయస్సులో అత్యంత ప్రభావశీల, స్ఫూర్తి దాయక వ్యాపారవేత్తులగా రాణించిన 40మందితో ఫార్చ్యూన్ ప్రకటించిన నివేదిక లో మొదటి స్థానం ఎవరికి దక్కింది.
జ: ఇన్ స్టా గ్రామ్ సహ వ్యవస్థపాకుడు కెవిన్ సిస్ట్రోమ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్
11) అంగారకుడిపై ద్రవ రూపంలో నీరు ఉన్నట్టు ఏ దేశానికి చెందిన పరిశోధకులు గుర్తించారు ?
జ: ఇటాలియన్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/