Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 25

రాష్ట్రీయం
01) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాదికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: డాక్టర్ పెన్నా శివరామకృష్ణ
02) ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రంగా మరో నాలుగేళ్ళ పాటు కొనసాగనున్న ప్రముఖ కంటి వైద్యశాల ఏది ?
జ: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (LVPEI)
03) రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచుల కాలపరిమితి 2018 ఆగస్టు 1 తో ముగుస్తోంది. వీరి బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారు ?
జ: పర్సన్ ఇన్ ఛార్జ్
04) హైదరాబాద్ లో కన్నుమూసిన నిర్మలానంద ఏ రంగానికి చెందినవారు ?
జ: సాహితీవేత్త (ప్రజాసాహితి గౌరవ సంపాదకులు)
05) భగత్ సింగ్ రాసిన నా నెత్తురు వృథా కాదు అనే హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినది ఎవరు ?
జ: నిర్మలానంద (కలంపేరు నిర్మలానంద వ్యాత్స్యాయన్ )
06) భాషా సాహిత్యాల వారధి చేకూరి రామారావు - అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: సాహితీ విమర్శకుడు డాక్టర్ ద్వానా శాస్త్రి
07) నిజాం మీర్ ఉస్మాన్ కాలంనాటి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లు పున:ప్రారంభం అవుతోంది. దీన్ని ఏ ఏడాదిలో నిర్మించారు?
జ: 1936లో ( 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది )
08) గొర్రెల అభివృద్ధి పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ , ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2017 జూన్ 20న సిద్ధిపేట జిల్లా కొండపాకలో
09) ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత వృత్తిదారుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్ గ్రేషియాని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రూ.2లక్షల నుంచి ఎంతకు పెంచింది ?
జ: రూ.5లక్షలు ( 2017 జూన్ 23న ఉత్తర్వులు జారీ చేసింది )

జాతీయం
10) ఏ ఆఫ్రికా దేశానికి ప్రధాని నరేంద్రమోడీ 200 ఆవులను బహుకరించారు ?
జ: రువాండ
11) ఏ ఆఫ్రికా దేశంలో భారత్ హైకమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు ?
జ: రువాండ ( రాజధాని :కిగాలి)
12) ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఉగండాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడి పేరేంటి ?
జ: యొవెరి ముసెవెని
13) మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లతో పాటు వారిపై జరిగే సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరేంటి ?
జ: cybercrime.gov.in
14) దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణ, వాటితో మోసపోకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ తెచ్చిన ట్విట్టర్ ఖాతా పేరేంటి ?
జ: సైబర్ దోస్త్ ( @cyber dost)
15) ఉద్యోగుల, ఫించనర్ల వేతనాల చెల్లింపు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానం ఏది ?
జ: ఈ-కుబేర్
16) మహారాష్ట్రలో ఏ వర్గం వారు రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నారు ?
జ: మరాఠాలు

అంతర్జాతీయం
17) మండిపోతున్న ఎండలతో కార్చిచ్చు గ్రీసు దేశాన్ని చుట్టుముట్టాయి. అయితే గ్రీస్ రాజధాని నగరం ఏది ?
జ: ఏథెన్స్
18) అమెరికాలో ఎంత మొత్తం పెట్టుబడి పెడితే EB-5 వీసా ద్వారా గ్రీన్ కార్డు కూడా పొందే అవకాశముంది ?
జ: 5లక్షల డాలర్లు ( రూ.3.5 కోట్లు )
19) అమెరికాకి ఇచ్చిన హామీ ప్రకారం నిరాయుధీకరణ దిశగా ఉత్తరకొరియా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏ శాటిలైట్ కేంద్రాన్ని ప్రస్తుతం కూల్చివేస్తున్నారు ?
జ: సోహే శాటిలైట్ లాంఛింగ్ స్టేషన్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/