Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 24

రాష్ట్రీయం
01) 2018 ఆగస్టు 4న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయన ఎక్కడ జరిగే హైదరాబాద్ IIT 7వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు ?
జ: సంగారెడ్డి జిల్లా కందిలో
02) దేశంలోనే మొదటిసారిగా నేరస్తులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని అవలంభించబోతోంది ?
జ: ఫేషియల్ డేటా బేస్ (ముఖ కవళికల సమాచార నిధి)

జాతీయం
03) మూక హింస, మూకల హత్యలకు పాల్పడే సంఘటనలను నియంత్రించేందుకు మార్గాలు, చట్టపరమైన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ఎవరెవరు నేత్రుత్వం వహిస్తున్నారు ?
జ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్ర హోం శాఖకార్యదర్శి రాజీవ్ గౌబా
04) రాజ్యసభ సభ్యులు తాము చర్చకు లేవనెత్తే అంశాలు,ప్రశ్నలకు సంబంధించిన నోటీసులు ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా పంపవచ్చని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. అందుకోసం ప్రారంభించిన యాప్ ఏది ?
జ: ఈ-నోటీసుల యాప్
05) భారత ప్రధాన న్యాయమూర్తి ఏ అంశాలపై చేపట్టే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ?
జ: రాజ్యాంగపరమైన అంశాలపై
06) ప్రధాన నరేంద్రమోడీ 3 ఆఫ్రికా దేశాల పర్యటనలో భగంగా రువాండా చేరుకున్నారు. రువాండా రాజధాని ఏది ?
జ: కిగలీ ( ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ )
07) ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAYG) పథకం కింది 2019 లోగా దేశవ్యాప్తంగా ఎన్ని ఇళ్ళు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: కోటి ఇళ్ళు ( కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి రామ్ క్రిపాల్యాదవ్ )
08) ప్రధాన మంత్రి పంటల బీమా పథకం ఏ ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2016-17
09) భారత్ స్టేజ్ - 6 (BS 6) ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల తయారీ, విక్రయాలను మనదేశంలో ఎప్పటి నుంచి అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2020 ఏప్రిల్ 1 నుంచి
10) పౌరుల్లో బాల్యం నుంచే సైన్స్ పై ఆసక్తి పెంచి సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఏది ?
జ: ఇన్ స్పైర్ మానక్
11) కేరళకు చెందిన ఏ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది ?
జ: శబరిమల
12) చెల్లని చెక్కుల కేసుల విచారణ స్పీడప్ అయ్యేందుకు ఉద్దేశించిన ఏ బిల్లును లోక్ సభ ఆమోదించింది ?
జ: ది నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లు
13) భారత్ - ఫ్రాన్స్ మధ్య విమానాలకు సంబంధించి రాఫెల్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది ?
జ: 2008లో
14) యోగా గురు రాందేవ్ బాబాపై వచ్చిన వివాదస్పద పుస్తకం ‘‘గాడ్ మ్యాన్ టూ టైకూన్’’ ఎవరు రచించారు ?
జ: జర్నలిస్ట్ ప్రియాంక పాఠక్ నారాయ్
15) తూర్పు ఆసియాలోనే మొదటి సెంటర్ ఫర్ క్లైమేట్ ఛేంజ్ ను నాబార్డ్ ఏ సిటీలో ఏర్పాటు చేసింది ?
జ: లక్నో
16) ఢిల్లీలో మంచి ఎయిర్ క్వాలిటీ, వాతావరణ పరిస్థితులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వ్యవస్థ పేరేది ?
జ: SAFAR
(System of Air Quality and Weather Forecasting)
17) 2017-18 సంవత్సరానికి ఝార్ఖండ్ లో అత్యధిక ఆదాయపు పన్ను రూ.12.17 కోట్లు చెల్లించింది ఎవరు ?
జ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
18) మిస్ఆసియా (చెవిటి) 2018 అవార్డు గెలుచుకున్న భారతీయురాలు ఎవరు ?
జ: దేష్మా జైన్ (మధ్యప్రదేశ్ )
19) జూనియర్ ఆసియాన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2018 లో 74 ఫ్రీ స్టైల్ కేటగిరీలో బంగారు పతకం గెలుచుకున్న భారతీయ రెజ్లర్ ఎవరు ;
జ: సచిన్ రతి

అంతర్జాతీయం
20) ఆండ్రాయిడ్ స్థానంలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తెచ్చేందుకు గూగుల్ సంస్థ పరిశోధన చేస్తోంది. కొత్త os పేరేంటి ?
జ: ఫ్యూషా
21) 2020 టోక్యో పారా ఒలింపిక్స్ గేమ్స్ అధికారిక మస్కట్ ఏది ?
జ: Someity
22) ఇటీవల చైనా ఆర్థిక రాజధాని షాంఘైని అతలాకుతలం చేసిన టైఫూన్ పేరేంటి?
జ: టైఫూన్ ఆంపిల్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/