Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 22

రాష్ట్రీయం
01) దేశంలోనే ISO ధృవీకరణ పొందిన తొలి ఆలయంగా నిలిచిన తెలంగాణకి చెందిన పుణ్యక్షేత్రం ఏది ?
జ: యాదాద్రి
02) రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంత మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 3.7 కోట్ల మందికి
03) కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్ట్ 15 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించనున్నారు.
జ: గజ్వేల్ లో
04) మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కృపాకర్ రెడ్డి
05) మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ఎవరు ?
జ: వేముల ప్రశాంత్ రెడ్డి


06) ఇప్పచెట్టు నీడలో - అంటూ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులతో తన అనుభవాలను పుస్తక రూపంలో ఉంచి IAS అధికారి ఎవరు ?
జ: డాక్టర్ శ్రీనివాసులు దాసరి
07) రూ.1.48 కోట్ల ఖర్చుతో 60 ఎకరాల స్థలంలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ఎడ్యుకేషన్ హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తోంది ?
జ: గజ్వేల్ లో
08) తెలంగాణకి చెందిన ఏ మహాకవుల జయంతి సందర్బంగా రాష్ట్రంలో తెలంగాణ కవితా సప్తాహం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ప్రకటించారు ?
జ: డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణ రెడ్డి
09) కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడి కాలంలోని వెయ్యేళ్ళ నాటి వనదుర్గం ఎక్కడ బయటపడింది ?
జ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి

జాతీయం
10) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన 28వ జీఎస్టీ మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. మొత్తం ఎన్ని వస్తువులపై పన్నులు తగ్గిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది ?
జ: 88 వస్తువులు
11) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2018 మార్చి 29న GSLV F08 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ప్రయోగించిన జీశాట్ -6ఏ సిగ్నల్స్ అందక వదిలేశారు. ఇప్పుడు అది ఏ ఆర్బిట్ లో తిరుగుతున్నట్టు గుర్తించారు ;?
జ: దక్షిణాఫ్రికాకి చెందిన ఆర్బిట్ లో
12) పెన్షనర్ల కోసం ఆధార్ ఆప్ కీ సేవా కా అనే ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఛత్తీస్ గడ్
13) స్వయం సహాయక సంఘాలు ( సెల్ఫ్ హెల్ప్ ) గ్రూపుల లింకేజ్ సేవలు అందించి 2018 నాబార్డ్ అవార్డు అందుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏది
జ: రెప్కా మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్
14) 10వ ఢిల్లీ డైలాగ్ 2018 యొక్క థీమ్ ఏంటి ?
జ: Strenghtening India-ASEAN Maritime cooperation
15) ఇటీవల మరణించిన గోపాల్ దాస్ నీరజ్ ఏ రంగానికి చెందినవారు ?
జ: పోయట్రీ

అంతర్జాతీయం
16) 2018 జులై 20న 8వ బ్రిక్స్ దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: డర్బన్ ( దక్షిణాఫ్రికా )
17) ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ లో 68 వ సభ్యదేశంగా ఇటీవల మయన్మార్ చేరింది. ISA ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది ?
జ: ఇండియా
18) ప్రతియేటా జులై 15న జరిపే వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2018 యొక్క థీమ్ ఏంటి
జ: Improving the image of TVET

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/