Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 21

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బుద్ధవనాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో నవంబర్ లో ప్రారంభించనున్నారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: నాగార్జున సాగర్
02) ఆగస్ట్ 1, 2018 నుంచి తెలంగాణలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేను ఎన్ని గ్రామాల్లో నిర్వహించనున్నారు ?
జ: 30 జిల్లాల్లోని 300 గ్రామాల్లో
03) 2016-17సంవత్సరానికి రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య నుంచి అవార్డు అందుకున్న బ్యాంకు ఏది ?
జ: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్ క్యాబ్)
04) తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ( ఆయిల్ ఫెడ్ ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కంచర్ల రామకృష్ణారెడ్డి
05) ఉస్మానియా యూనివర్సిటీలో రూ.3కోట్ల ఖర్చుతో 300 టెరా బైట్స్ తో భారీ సామర్థ్యంతో స్మార్ట్ డేటా సెంటర్ ను అందుబాటులోకి తేనున్నారు. ఏ పథకం నిధుల కింద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ?
జ: రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా)

జాతీయం
06) సుప్రీంకోర్టు జడ్జిగా కె.ఎం.జోసెఫ్ కి పదోన్నతి కల్పించడానికి సుప్రీం న్యాయస్థాన కొలీజియం మరోసారి సిఫార్సు చేసింది. అయితే జోసెఫ్ ప్రస్తుతం ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు ?
జ: ఉత్తరాఖండ్
07) రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి ?
జ: 31 మంది (ప్రస్తుతం ఉన్నది 22 మందే )
08) భారత్, అమెరికా (2+2) మంత్రిత్వ స్థాయి చర్చలు ఢిల్లీలో ఎప్పుడు జరగనున్నాయి ?
జ: 2018 సెప్టెంబర్ 6
09) భారత్, అమెరికా మంత్రిత్వ స్థాయి చర్చల్లో ఎవరెవరు పాల్గొంటారు ?
జ: భారత్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్
10) ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్రికా దేశాల్లో ఎప్పుడు పర్యటించనున్నారు ?
జ: 2018 జులై 23 నుంచి 27 వరకూ
11) టూ వీలర్స్ కి ఎన్నేళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ?
జ: ఐదేళ్ళు
(నోట్: కార్లకు 3యేళ్ళు )

అంతర్జాతీయం
12) అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న దక్షిణకొరియా మాజీ దేశాధ్యక్షురాలికి మరో 8యేళ్ళ జైలుశిక్ష పడింది. ఆమె పేరేంటి ?
జ: ఫార్క్ గ్యున్ హే
13) శ్రీలంకలో 1984లో నిర్మించిన ఏ అంతర్జాతీయ స్టేడియాన్ని కూల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గాలె అంతర్జాతీయ స్టేడియం
(నోట్: 2004లో వచ్చిన సునామీకి స్టేడియం బాగా దెబ్బతిన్నది )

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/