Monday, December 16

CURRENT AFFAIRS – JULY 20

తెలంగాణ
01) ఇక నుంచి రిజిష్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు రహిత సేవలను అందించేందుకు వీలుగా ఏ యాప్ ద్వారా చెల్లింపులను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: టీ-వాలెట్ యాప్
02) భారత వ్యవసాయ పరిశోధనా మండలి 33 అంశాల్లో పనితీరును మదింపు చేసి ప్రకటించిన జాబితాలో దక్షిణాది వ్యవసాయ యూనివర్సిటీల్లో ఏ వర్సిటీకి ఫస్ట్ ర్యాంక్ దక్కింది ?
జ: ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
(నోట్: దేశవ్యాప్తంగా 6వ ర్యాంక్ )
03) తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ళ సమాఖ్య (FTCCI) అధ్యక్షుడిగా 2019-20 సంవత్సరానికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: కరుణేంద్ర జాస్తి
04) ఉష్ణోగ్రత, రేడియేషన్ పై అధ్యయనం కోసం తెలంగాణ ఎస్సీ గురుకులాల విద్యార్థులు తయారు చేసిన బెలూన్ ఏది ?
జ: స్వేరో శాట్ - 1
(నోట్ : దీన్ని స్ట్రాటో స్పియర్ లోకి ప్రవేశపెట్టారు. జులై 19 తెల్లవారుజామున 2.40 గంటలకు ECIL ఆవరణలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కేంద్రం నుంచి ప్రయోగించారు )
05) జీర్ణకోశ వ్యాధులను గుర్తించేందుకు అధునాతన పరికరాన్ని హైదరాబాద్ లోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (AIG) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. ఆసియాలోనే మొదటిసారిగా ఈ పరికరాన్ని తీసుకొచ్చారు. దీని పేరేంటి ?
జ: పవర్ స్పైరల్ ఎంటరోస్కోపీ

జాతీయం
06) అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రశంసలు కురిపించింది ?
జ: ఉజ్వల పథకం
07) భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు ?
జ: డి.రాజా
08) కంప్యూటర్, సైన్స్ రంగలో అందించిన సేవలకు గాను ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తికి ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది ?
జ: రాయల్ హాలోవే యూనివర్సిటీ
09) జలుబు, ఫ్లూ, కొన్ని రకాల అలెర్జీలను అదుపు చేయడానికి వినియోగించే జనరిక్ డ్రగ్ ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించింది...ఆ మందు పేరేంటి ?
జ: అలెగ్రా - డీ 12 HR
10) దేశంలో మొబైల్ కలెక్షన్స్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఆపరేటర్లు ఏవి ?
జ: మొదటి స్థానం వొడాఫోన్ - ఐడియా, రెండో స్థానం - జియో, మూడో స్థానం - భారతీ ఎయిర్ టెల్
11) ICC హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరు ?
జ: సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బౌలర్ అలెన్ డొనాల్డ్
(నోట్: గతంలో హాల్ ఆఫ్ ఫేమ్ లో సునిల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ కు ఈపురస్కారం దక్కింది. సచిన్ ఆరోవాడు )
12) జర్మనీలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్ లో పురుషుల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వర్ణం గెలుచుకొని ప్రపంచ రికార్డు సాధించినది ఎవరు ?
జ: ఐశ్వర్య ప్రతాప్ సింగ్
13) చదరంగంలో భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ ఆవిర్భవించాడు. ఢిల్లీకి చెందిన ఆ 15యేళ్ళ యువకుడు ఎవరు ?
జ: ప్రీతూ గుప్తా
14) ఒడిశాలోని కటక్ లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ లో టైటిల్స్ సాధించిన జట్టు ఏవి ?
జ: భారత జట్లు.