Sunday, November 18
Log In

CURRENT AFFAIRS – JULY 13

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో 2018 ఆగస్టు 2న కొత్తగా ఎన్ని గ్రామపంచాయతీలు ఏర్పడబోతున్నాయి ?
జ: 4,383
02) రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ పథకాల్లో లబ్దిదారులకు ఎంతమొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది ?
జ: రూ.1,00,116లు
(నోట్: 2014లో పథకం ప్రారంభించినప్పుడు రూ.51వేలు, 2017లో రూ.75,116లు ఇచ్చేవారు )
03) గొర్రెల పెంపకానికి 200 ఎకరాల్లో ప్రత్యేకంగా షీప్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో
04) విద్యార్థులు సమర్పించే పరిశోధనా గ్రంథాల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఇకపై ఏ సాఫ్ట్ వేర్ తో తనిఖీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది ?
జ: యాంటీ ప్లాగియారిజం సాఫ్ట్ వేర్ ( టర్నిటిన్)
05) రైలులో సాధారణ బోగీల్లో ప్రయాణించే ప్రయాణీకులు కూడా UTS మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసేలా యాప్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: 2018 జులై 16 నుంచి

జాతీయం
06) ఇండియా - కొరియా టెక్నాటజీ ఎక్చేంజ్ సెంటర్ ను ఏ సిటీలో ఏర్పాటు చేయనున్నారు ?
జ: న్యూ ఢిల్లీ
07) పుణెలో కన్నుమూసిన దాదా వాస్వానీ ఎవరు ?
జ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది
08) పంజాబ్ నేషనల్ బ్యాంక్ MD & CEO ఎవరు ?
జ: సునీల్ మెహతా
09) BSNL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎవరు ?
జ: అనుపమ్ శ్రీవాస్తవ
10) దల్మా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: జార్ఖండ్
11) పేద ప్రజలకు సబ్సిడీతో ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటిన్స్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
12) విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు One Farmer One transformer పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మహారాష్ట్ర
13) ఫిన్ లాండ్ లోని తాంపెరెలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో 400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: భారత స్టార్ స్ర్పింటర్ హిమదాస్

అంతర్జాతీయం

15) అమెరికాలో సంపన్న మహిళల్లో చోటు దక్కించుకున్న మన భారతీయ మహిళలు ఎవరు ?
జ: జయశ్రీ ఉల్లాల్ (1.3బిలియన్ డాలర్లు - రూ.8840 కోట్లు )
నీరజా సేథి (బిలియన్ డాలర్లు - రూ.6,800 కోట్లు)
16) ఐక్యరాజ్యసమితి మలాల దినోత్సవాన్ని ప్రతియేటా ఎప్పుడు నిర్వహిస్తోంది ?
జ: జులై 12
17) అరుణ గ్రహం ( మార్స్ ) పై కాలుమోపబోయే తొలి మహిళగా రికార్డ్ సొంతం చేసుకోబోతున్న అమెరికా బాలిక ఎవరు ?
జ: అలెసా కార్సన్ (17)
18) 2018 జులై 11న జరిగిన అంతర్జాతీయ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ?
జ: Family Planning is a Human right

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/