Friday, February 22

CURRENT AFFAIRS JULY 02

రాష్ట్రీయం
01) రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
02) ECIL సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రియర్ అడ్మిరల్ సంజయ్ చౌబే ( నావికాదళం రిటైర్డ్ మాజీ అధికారి)
03) ఆసియాలోనే రెండో అతిపెద్ద మెట్రో స్టేషన్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: MGBS దగ్గర
04) బాబ్లి ప్రాజెక్టు 14 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని వదిలారు మహారాష్ట్ర అధికారులు. అయితే బాబ్లీ ఏ నదిపై ఉంది ?
జ: గోదావరి నదిపై
05) హైదరాబాద్ జోన్ పరిధిలోని పరిశ్రమల్లో అత్యధిక జీఎస్టీ చెల్లింపుదారుగా నిలిచిన ఏ పరిశ్రమకు అవార్డును ప్రదానం చేశారు ?
జ: సింగరేణి
(నోట్: 2017 జులై 1నుంచి 2018 మార్చి 18 వరకూ రూ.2,100 కోట్ల జీఎస్టీని సింగరేణి చెల్లించింది )

జాతీయం
06) వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో సగటున కేంద్రానికి ఎంత మొత్తం వసూలవుతోంది ?
జ: రూ.1.10 లక్షల కోట్లు
07) 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా నెలకు సగటున ఎంత మొత్తం వసూలైనట్టు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ?
జ: రూ.89,885 కోట్లు
08) సుప్రీంకోర్టులో కేసుల భారం తగ్గించేందుకు ఎంత మొత్తానికి మించిన కేసుల విషయంలో మాత్రమే హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తోంది ?
జ: రూ.50 లక్షలకు మించిన కేసులు
(నోట్: ప్రస్తుతం ఈ పరిమితి రూ.10లక్షలుగా ఉంది)
09) ప్రస్తుత ఖరీఫ్ కాలంలో క్వింటాల్ వరి ధాన్యం మద్దతు ధరను ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.1750
(నోట్: ప్రస్తుతం సాధారణ రకం రూ.1550/- , ఏ గ్రేడ్ రకం రూ.1590 గా ఉంది )
10) వచ్చే పార్లమెంట్ సమావేశాల నుంచి ఒక్కో లోక్ సభ సభ్యుడు రోజుకి ఎన్ని ప్రశ్నలు మాత్రమే అడగాలని నిబంధన విధించారు ?
జ: ఐదు ప్రశ్నలు
11) పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గుతున్న ఎంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి జాబితాను సమర్పించింది ?
జ: 471 మంది
12) స్విట్జర్లాండ్ కి డబ్బు తరలిస్తున్న దేశాలో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నట్టు స్విస్ నేషన్ బ్యాంక్ వెల్లడించింది ?
జ: 73 వ స్థానం
13) చైనాలోని బీజింగ్, షాంఘై, గువాంగ్ జౌ, హాంకాంగ్ లాంటి ప్రధాన నగరాలను తాకగల అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని సైన్యానికి అందజేయనున్నారు. ఇది ఎన్నివేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు ?
జ: 5 వేల కిమీ
14) ఉత్తర భారత దేశంలో అతిపెద్ద వెంకటేశ్వరుని ఆలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు. ?
జ: హరియానాలోని కురుక్షేత్రలో
(నోట్: 5.52 ఎకరాల్లో, రూ.34 కోట్లతో నిర్మిస్తున్నారు)

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/