Thursday, March 21

CURRENT AFFAIRS – JAN 6 &7

తెలంగాణ
01) తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ఎవరిని ప్రభుత్వం ఎంపిక చేసింది ?
జ: చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
02) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి ?
జ: 2019 జనవరి 17

జాతీయం
03) గనుల అక్రమ తవ్వకాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ రూ.100కోట్ల జరిమానా విధించింది ?
జ: మేఘాలయ ప్రభుత్వంపై
04) దేశంలోనే మొదటిసారిగా ఏ నదిలో ఆక్టోపస్ లను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు ?
జ: నర్మదా నది ఉప్పునీటి జలాల్లో
05) సెప్టోపస్ ఇండికస్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఎన్ని ఆక్టోపస్ లు నర్మదా నదిలో కనిపించాయి ?
జ: 17 ఆక్టోపస్ లు
06) పెద్ద నోట్లు రద్దయిన స్థానంలో విడుదల చేసిన కొత్త నోట్లు నేపాల్ లో చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఆ దేశ బ్యాంకు ఏది ?
జ: నేపాల్ రాష్ట్ర బ్యాంకు ( NRB)
07) విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం ప్రకారం నేపాలీయులు ఎంతమేరకు భారతీయ కరెన్సీని తమ దగ్గర ఉంచుకునే అవకాశం ఉంది ?
జ: రూ.25 వేలు
08) భారత సైన్యం చరిత్రలో మొదటిసారి సైనిక దినోత్సవం కవాతుకు (ఆర్మీ సర్వీస్ కోర్) నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారి ఎవరు ?
జ: లెఫ్టినెంట్ భావనా కస్తూరి
09) అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు ఢిల్లీ, ముంబై, బెంగళూరులకు చెందిన నిపుణులైన డాక్టర్లు, ఇతర సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలతో వస్తున్న రైలు బండి పేరేంటి ?
జ: లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్
10) దేశంలో ఆర్థిక జనగణన ఎప్పుటి నుంచి మొదలైంది ?
జ: 1977లో
11) ఆధార్ అనుసంధానంతో గత ఏడాది మార్చి ఆఖరు నాటికి ఎంత మొత్తం ఆదా అయినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు ?
జ: రూ.90 వేల కోట్లు

అంతర్జాతీయం
12) దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఆరోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలిగిన మలేసియా రాజు పేరేంటి ?
జ: సుల్తాన్ మహ్మద్ (49)

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/