Sunday, May 19

CURRENT AFFAIRS – JAN 3 & 4

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు ఏవి ?
జ: ములుగు, నారాయణ పేట
02) దేశానికి దిక్సూచి తెలంగాణ అనే పుస్తకాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దీన్ని ఎవరు రచించారు ?
జ: బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు
03) బిఎస్ రాములు సాహిత్యం - సమగ్ర పరిశీలన - పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: కర్రె సదాశివ్
04) పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారికి ఏ వేలికి సిరా గుర్తు పెట్టనున్నారు ?
జ: ఎడమచేతి మధ్యవేలు
05) పంచాయతీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ తో ఎంతమంది మహిళలు సర్పంచ్ లు కాబోతున్నారు ?
జ: 6,378 మంది (వార్డు మెంబర్స్ 56,690 మంది )
06) రాష్ట్రంలో గతంలో పోచంపల్లి, వరంగల్ లోని చేనేత వస్త్రాలను అమెజాన్ ద్వారా అమ్ముతున్నారు. కొత్తగా ఆన్ లైన్ విక్రయాల్లో చేరిన చేనేత వస్త్రాలు ఎక్కడివి ?
జ: గద్వాల జరీ వస్త్రాలు
07) చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలను 2019 జనవరి 6 నుంచి ఏయే జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు ?
జ: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో

జాతీయం
08) 106వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్ లో
09) సిరామిక్, పాలిమర్స్ కలిపి స్మార్ట్ మెటీరియల్ లో భాగంగా ఎముకలను తయారు చేసిన ఐఐటీ పరిశోధకులు ఎవరు ?
జ: ఐఐటీ హైదరాబాద్
10) గో సంరక్షణ కోసం ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఉత్తరప్రదేశ్
11) 2018-19 సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ గా రూ.699 కోట్లు చెల్లించిన సచిన్ బన్సల్ ఏ దేశీయ ఈకామర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు ?
జ: ఫ్లిప్ కార్ట్
12) రాజ్యసభలో మీడియా అడ్వైజరీ కమిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు ఛైర్మన్ గా ఉన్నారు ?
జ: ట్రైబ్యూన్ పత్రిక ఎడిటర్ కేవీ ప్రసాద్ ( 18మంది సభ్యులు )
13) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోచ్ ముంబైలో కన్నుమూశారు. ఆయన ఎరవు ?
జ: రమాకాంత్ అచ్రేకర్
14) చినూక్, అపాచె అత్యాధునిక హెలికాప్టర్లు త్వరలో భారత్ అమ్ముల పొదిలో చేరనున్నాయి. వీటిని ఏ దేశం సప్లయ్ చేస్తోంది ?
జ: అమెరికా
15) అమెరికా నుంచి ఎన్ని చినూక్, అపాచె హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేస్తోంది ?
జ: 15 చినూక్, 22 అపాచె హెలికాప్టర్లు

అంతర్జాతీయం
16) ఏ విప్లవానికి 60యేళ్ళయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నారు ?
జ: క్యూబా విప్లవం
(నోట్: అప్పట్లో ఫిడేల్ క్యాస్ట్రో దీనికి నాయక్తవం వహించారు. 1958 డిసెంబర్ 31న అమెరికా మద్దుతో పాలన సాగించిన నియంత బటిస్టా దేశం విడిచి పారిపోయారు. దాంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్ట్ పాలన మొదలుపెట్టారు )
17) పాకిస్తాన్ కి టైప్ 054ఏపీ తరగతికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకను అందిస్తున్న దేశం ఏది ?
జ: చైనా
18) సింగపూర్ లో జరిగిన వరల్డ్ మెమోరీ చాంపియన్షిప్ లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న భారత సంతతి బాలుడు ఎవరు ?
జ: ధృవ్ మనోజ్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/